Begin typing your search above and press return to search.

క్లాస్‌మేట్‌ని పెళ్లాడిన హీరోగారు...

By:  Tupaki Desk   |   27 Jun 2015 1:30 PM GMT
క్లాస్‌మేట్‌ని పెళ్లాడిన హీరోగారు...
X
జ్యోతిలక్ష్మి సినిమాతో ఓ కొత్త హీరో టాలీవుడ్‌ సర్కిల్స్‌లో పాపులర్‌ అయ్యాడు. వేశ్యని మొహమాటం లేకుండా ప్రేమించిన సదరు హీరో పేరు సత్య. వైజాగ్‌ వాసి. బెంగళూరులో ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్లాడు. కానీ ఆసక్తి లేక నటనవైపు అడుగులు వేశాడు. లుక్‌ బావుంది. హీరో అయ్యే లక్షణాలున్నాయి. అంతే అప్పట్లో మైనే ప్యార్‌ కియా చిత్రంలో ఓ కీలకపాత్రలో అవకాశం వచ్చింది. 26వయసులో 40 వయసున్న వాడిలా నటించాడు.

ఆ తర్వాత ఇటీవలే అసుర చిత్రంలో ఓ చిన్నపాత్రలో నటించాడు. ఈసారీ చక్కని పేరొచ్చింది. అయితే వీటన్నిటినీ మరిపిస్తూ జ్యోతిలక్ష్మి చిత్రంలో హీరో ఛాన్స్‌ పట్టేశాడు. పూరి జగన్నాథ్‌ అవకాశం ఇచ్చి ప్రోత్సహించడంతో ఒక్కసారిగా జనాల కళ్లన్నీ ఈ కుర్రాడిపై పడ్డాయి. ప్రస్తుతం దర్శకనిర్మాతలు ఈ కుర్రాడిని సంప్రదిస్తున్నారు. హీరోగా అవకాశాలివ్వడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే అతడు నటించిన క్షణం రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే సత్యకి మరింత క్రేజు పెరగడం ఖాయం.

అయితే సత్యని చూసి మనసు పారేసుకున్న అమ్మాయిలందరికీ ఓ షాకింగ్‌ న్యూస్‌. ఇతగాడు ఇప్పటికే మ్యారీడ్‌. చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడేశాడు. గత ఏడాదే వీరి వివాహం జరిగింది. అమ్మాయి పేరు దీపిక. దీపిక అంటే దీపిక పదుకొన్‌ అనుకునేరు. కేవలం క్లాస్‌మేట్‌ మాత్రమే. ఆల్‌ ది బెస్ట్‌ టు సత్య.