Begin typing your search above and press return to search.

ఒక్కటి కాదు రెండు తుపాకులతో సత్యదేవ్‌

By:  Tupaki Desk   |   13 April 2022 8:34 AM GMT
ఒక్కటి కాదు రెండు తుపాకులతో సత్యదేవ్‌
X
జ్యోతిలక్ష్మి సినిమా తో నటుడిగా పరిచయం అయ్యి హీరోగా సెటిల్‌ అయిన సత్యదేవ్‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు. హీరోగా ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తున్నాయి అనే విషయం పక్కన పెడితే సత్యదేవ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం మాత్రం ప్రేక్షకుల్లో కలిగింది. విభిన్నమైన చిత్రాలతో ఈయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇటీవలే స్కైలాబ్‌ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా సత్యదేవ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్‌ ఫాదర్‌ సినిమా లో సత్యదేవ్‌ కిలక పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న సత్యదేవ్ తాజాగా గాడ్సే సినిమాను పూర్తి చేశాడు.

బ్లఫ్‌ మాస్టర్‌ అనే సినిమా కోసం గోపీ గణేశ్‌ దర్శకత్వంలో సత్యదేవ్‌ వర్క్ చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కింది. గాడ్సే అనే సినిమా తో దర్శకుడు గోపీ గణేష్ మరోసారి విభిన్నంగా సత్యదేవ్‌ ను చూపించేందుకు సిద్దం అయ్యాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈసినిమా టైటిల్‌ తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. రెండు మూడు నెలలకు ఒక సినిమా చొప్పున తీసుకు వచ్చేలా హీరో సత్యదేవ్‌ బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన గాడ్సే సినిమాను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

చిత్ర యూనిట్‌ సభ్యులు మే 20వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సినిమాలో గాడ్సే పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడా లేదా మరేదైన పాత్రనా అనే విషయం తేలాల్సి ఉంది. పోస్టర్ లో మాత్రం రెండు తుపాకులు చేతిలో పట్టుకుని చాలా సీరియస్ గా స్టైల్ గా సత్యదేవ్‌ కనిపిస్తున్నాడు.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్సే సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.