Begin typing your search above and press return to search.
సత్యదేవ్ ఆశలన్నీ ఇక కృష్ణమ్మ మీదేనా?
By: Tupaki Desk | 12 Dec 2022 2:30 AM GMTఇండస్ట్రీలో టాలెంట్ వుంటే సరిపోదు..రవ్వంత అదృష్టం కూడా వుండాలంటారు. ఒక్కసారి లక్కు తిరిగిందా..? ఆపడం కష్టం అంటుంటారు. ఇప్పుడు హీరో సత్యదేవ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సత్యదేవ్ లో చాలా టాలెంట్ వుంది. ఆ టాలెంట్ కి తగ్గట్టే హీరో గా వరుస అవకాశాల్ని దక్కించుకుంటూ ముందుకు వెళుతున్నాడు. సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి అతని టాలెంట్ ని మెచ్చి `గాడ్ ఫాదర్`లో అవకాశం ఇవ్వడం తెలిసిందే. కానీ అంతగా స్టార్ హీరో సినిమాలో ఏరి కోరి నటించినా సత్యదేవ్ కు పేరైతే వచ్చింది కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక నిరుత్సాహ పరిచింది.
పోనీ హీరోగా చేసిన సినిమా అయినా సక్సెస్ ని అందిస్తుందని ఆశపడితే అది కూడా జరగడం లేదు. మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి సత్యదేవ్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ `గుర్తుందా సీతాకాలం`. నాగ శేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 2020లో వచ్చిన కన్నడ మూవీ `లవ్ మోక్‌టైల్` ఆధారంగా రీమేక్ చేశారు. ఇలాంటి కథలు ఇప్పటి వరకు తెలుగులో `నా ఆటోగ్రాఫ్ స్వీట్ మోమొరీస్` నుంచి `ప్రేమమ్` వరకు చాలా వచ్చాయి.
ఇవి తెలిసి కూడా సత్యదేవ్ కావాలని పనిగట్టుకుని కన్నడ రీమేక్ ని చేశాడన్నది ఎవరికీ అర్థం కాని విషయం. వచ్చిన కథలతో రూపొందిన ఈ మూవీని.. మళ్లీ అదే కథని చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించలేకపోయారు. దీంతో సత్యదేవ్ ఖాతాలో `గుర్తుందా సీతాకాలం` రూపంలో మరో డిజాస్టర్ చేరింది. ఎంత టాలెంట్ వున్నా కూడా సత్యదేవ్ ఇలాంటి కథలని ఎంచుకుంటూ తనకు తానే డిజాస్టర్ లని కొని తెచ్చుకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే తెలిసిన కథ కావడంతో సత్యదేవ్, తమన్నాతో పాటు టీమ్ అంతా హడావిడి చేస్తూ ప్రమోషన్స్ చేసినా ఆడియన్స్ పెద్దగా కనికరించలేదు. కనీసం యూత్ ని కూడా మెప్పించలేకపోవడంతో ఫ్లాప్ గా నిలిచి షాకిచ్చింది. `నా ఆటోగ్రాఫ్ స్వీట్ మోమొరీస్` నుంచి `ప్రేమమ్` చిత్రాలని గుర్తు చేస్తూ ఓ యువకుడి జీవితంలో ఎదురైన ప్రేమకథల సమాహారంగా దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ ఏ విషయంలోనూ యూత్ ని, ప్రేమికుల్ని కూడా అలరించలేకపోయింది.
దీంతో సత్యదేవ్ ఫైనల్ గా కొరటాల శివ సమర్పణలో తెరకెక్కిన `కృష్ణమ్మ`పైనే ఆధారపడాల్సి వస్తోంది. రఫ్, అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సత్యదేవ్ నటించిన ఈ మూవీ విజయవాడ నేపథ్యంలో సాగనుంది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీతో అయినా సత్యదేవ్ కమర్షియల్ సక్సెస్ ని దక్కించుకుని హీరోగా సరికొత్త ట్రాక్ లోకి చేరి కొత్త ఇమేజ్ ని దక్కించుకుంటాడా? అన్నది వేచి చూడాల్సిందే.