Begin typing your search above and press return to search.
'ఆఫ్ఘనిస్తాన్ లో నన్ను సూసైడ్ బాంబర్ అనుకుని గన్ గురిపెట్టారు'
By: Tupaki Desk | 4 Aug 2020 6:24 PM GMTసినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని సినిమా కష్టాలు అన్నీ చూసి నిలదొక్కుకున్నవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో నటుడు సత్యదేవ్ ఒకరని చెప్పవచ్చు. 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో చిన్న రోల్ లో కనిపించిన సత్యదేవ్ ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'అత్తారింటికి దారేది' 'ముకుంద' లాంటి ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతి లక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ క్రమంలో గత కొన్ని ఏళ్లుగా వైవిధ్యభరిత పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో 'క్షణం' 'అంతరిక్షం' 'ఘాజీ' 'బ్లఫ్ మాస్టర్' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' 'సరిలేరు నీకెవ్వరు' '47 డేస్' వంటి సినిమాలు సత్య దేవ్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' అనే రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇక రీసెంటుగా సత్యదేవ్ హీరోగా నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' ఓటీటీలో రిలీజ్ అయింది. 'బాహుబలి' నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో సత్యదేవ్ హీరోగా మరో మెట్టు ఎక్కాడు. ప్రస్తుతం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సత్యదేవ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.
కాగా సత్యదేవ్ ఈ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తాను ఎదుర్కున్న కష్టాల గురించి వివరించాడు. మెగాస్టార్ చిరంజీవి 'బ్లఫ్ మాస్టర్' సినిమా చూసి తనను ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 'బ్లఫ్ మాస్టర్' సినిమా తాను చేయాల్సింది కాదని.. ఈ సినిమా వల్లే మెగాస్టార్ ని కలిసే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలు పోషించడంపై మాట్లాడుతూ.. తనకు ప్లాట్ ఫార్మ్ లేదని.. తనకి అదొక్కటే మార్గమని.. ఇలానే వెళ్ళాలి.. ఇదే ప్రాసెస్ అని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. చిన్న పాత్ర అయినా 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీ లేకపోతే నేను లేనని.. 'ఉమామహేశ్వర' నాకు ఎంత ఇంపార్టెంటో 'మిస్టర్ పర్ఫెక్ట్' కూడా అంతేనని అన్నాడు. పెద్ద బ్యానర్స్ వారిని కలిసినా అవకాశాలు రాకపోవడానికి తనకు కమర్షియల్ సక్సెస్ లేకపోవడమే కారణంగా చెప్పాడు. ఆఫ్ఘానిస్తాన్ లో హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను సూసైడ్ బాంబర్ అనుకుని గన్ గురిపెట్టారని చెప్పుకొచ్చాడు.