Begin typing your search above and press return to search.
సత్యం రామలింగరాజు కోడలు కథానాయికగా..!
By: Tupaki Desk | 25 Jan 2021 2:30 AM GMTఅక్కినేని కోడలు సమంత కోడలు కాకముందే కథానాయిక. కోడలు అయ్యాక కూడా కథానాయికగా రాణిస్తున్నారు. మెగా కోడలు ఉపాసన కోడలు కాకముందు నుంచి ఎంటర్ ప్రెన్యూర్. తాను ఆ రంగంలోనే కొనసాగుతున్నారు. ఇక ఐటీ ప్రొఫెషనల్ సత్యం కంప్యూటర్స్ అధినేత
సత్యం రామలింగరాజు కోడలు సంధ్య రాజు కథానాయికగా నటిస్తుండడం ప్రస్తుతం పరిశ్రమలో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రామలింగరాజు కుమారుడు రామరాజు భార్యామణి సంధ్యా రాజు. ఆమె కూచిపూడి నృత్యంలో స్పెషలిస్ట్. నాట్యం అనేది తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మెగా కోడలు ఉపాసన స్వయంగా షేర్ చేసి ప్రచారం చేశారు. ఈ పోస్టర్ ఎంతో సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకుంటోంది.
డ్యాన్స్ మార్గంలో అందమైన మార్గాన్ని అన్వేషించడం ఈ సినిమా కాన్సెప్ట్. గురు శిష్యుల అనుబంధం గురించి ఆవిష్కరిస్తుంది. తెలంగాణ ఏపీ సహా హైదరాబాద్ లోనూ ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి రచయితగానే కాకుండా దర్శకత్వం వహించారు.
కమల్ కామరాజు-రోహిత్ బెహల్-ఆదిత్య మీనన్-శుభలేఖ సుధాకర్- భానుప్రియ- బేబి దీవానా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. హంపీ-లేపాక్షి- బెంగళూరు- హైదరాబాద్ లోని పలు దేవాలయాల్లో నాట్యం చిత్రాన్ని తెరకెక్కించారు. సంధ్యా రాజు ఇంతకుముందు మలయాళ చిత్రం కేర్ ఫుల్ లో నటించారు. లఘు చిత్రాల్లోనూ నటించారు.