Begin typing your search above and press return to search.

చిరు 150:కొడతారనే భయంతో కథ రాయలేదు

By:  Tupaki Desk   |   1 Aug 2016 11:30 AM GMT
చిరు 150:కొడతారనే భయంతో కథ రాయలేదు
X
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ రచయితల్లో సత్యానంద్ ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన రచయితగా కొనసాగుతున్నారు. అప్పట్లో ‘అడవి రాముడు’ లాంటి ఆల్ టైం మెగా హిట్ కు రాశారు. ఈ మధ్యే ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి కూడా రచనా సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవితో 20కి పైగానే సినిమాలు చేశారాయన. యముడికి మొగుడు.. అభిలాష.. దొంగ మొగుడు.. రౌడీ అల్లుడు.. ఘరానా మొగుడు.. లాంటి సూపర్ హిట్లకు పని చేశారాయన. మరి చిరంజీవి 150వ సినిమాకు కథ రాసే ప్రయత్నమేదీ జరగలేదా.. చిరు ఆ విషయంలో మిమ్మల్ని ట్రై చేయలేదా అని అడిగితే.. మెగాస్టార్ అభిమానులకు భయపడే తాను ఆ ప్రయత్నం చేయలేదని అంటున్నారు సత్యానంద్.

ఇంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవి గారిని మోయడం కష్టం. చిరంజీవి గారికి కథ రాసి.. ఆ సినిమా సరిగా ఆడకపోతే చాలా రిస్క్. మా హీరో 150వ సినిమాకు ఇలాంటి కథ రాస్తారా అంటూ ఆయన అభిమానులు వచ్చి కొట్టినా కొడతారు. ఎందుకొచ్చిన గొడవ. అందుకే నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఐతే చిరంజీవి గారు ఇప్పుడు చేస్తున్న కథ మాత్రం వినిపించారు. ఆయన బాడీలాంగ్వేజ్‌ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు మాత్రం చెప్పాను’’ అని సత్యానంద్ అన్నారు. చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతున్న చోటికి వెళ్లి చరణ్ తో తాను పరాచికాలు కూడా ఆడినట్లు సత్యానంద్ వెల్లడించారు. ‘‘చిరంజీవి సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్తే అక్కడ చరణ్ కనిపించాడు. ‘కొత్త నిర్మాతవి. ఎవరో కొత్త హీరోను ఇంట్రడ్యూస్‌ చేస్తున్నట్లున్నావ్. ఎవరో చాలా బాగా చేస్తున్నట్టున్నాడే’ అన్నాను. చిరంజీవి నాకు అంత కొత్తగా కనిపించారు’’ అని సత్యానంద్ అన్నారు.