Begin typing your search above and press return to search.
స్టార్ హీరోల గురువు షాకింగ్ స్టేట్ మెంట్
By: Tupaki Desk | 15 Nov 2016 11:11 PM GMTటాలీవుడ్ లో ఈ రోజు కనిపించే ఏ స్టార్ హీరో అయినా సరే.. తొలినాళ్లలో ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిందే. టాలీవుడ్ వరకూ ఎవరు తెరంగ్రేటం చేయాలన్నా సరే.. వైజాగ్ సత్యానంద్ దగ్గర శిష్యరికం చేయాల్సిందే. స్టార్ హీరోలందరికి సోలో గురువుగా ఉన్నా.. ఆయనకు రావాల్సినంత స్టార్ స్టేటస్ రాలేదనే చెప్పాలి. మీడియాకు కాస్త దూరంగా ఉండటంతో పాటు తనను తాను ప్రమోట్ చేసుకునే విషయంలోనూ ‘విలువలు’ పేరిట పరిధులు గీసుకునే సత్యానంద్ తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కుఇంటర్వూఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని షాకింగ్ స్టేట్ మెంట్లు ఇచ్చారు.
పవన్ కల్యాణ్.. మహేశ్ బాబు.. ప్రభాస్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 95 మంది హీరోల్నిసినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సత్యానంద్ కు.. మీరు తయారు చేసిన హీరోల్లో గొప్ప నటుడు ఎవరని చెప్పమంటే మాత్రం.. ఎవరూ లేరని ఎలాంటి మొహమాటంలేకుండా చెప్పేయటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుందేమో. తన దగ్గరకు ఎవరినైనా తీసుకొచ్చి.. వారు హీరోగా రాణిస్తారా? లేదా? అన్న విషయాన్ని అడిగితే కొద్దిరోజులకే చెప్పేస్తానని చెప్పే సత్యానంద్ ఒక ఆసక్తికర మైన విషయాన్ని తీసుకొచ్చారు.
ప్రభాస్ కు పాఠాలు చెప్పే క్రమంలో వారింటికి ఒకసారి భోజనానికి వెళ్లినప్పుడు.. రానున్న రోజుల్లో టాప్ ఫైవ్ హీరోల్లో ఒకరిగా ప్రభాస్ అవతరిస్తారని తాను చెప్పినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయిన విషయాన్ని చెప్పారు.గొప్ప నటులు ఎవరూలేరన్న తన మాట విన్నప్పుడు హీరోలకు కోపం వచ్చినా అది వాస్తవంగా తేల్చేశారు.
తన దగ్గర పాఠాలు నేర్చుకున్న వారంతా గొప్ప స్థాయికి వెళ్లారని.. వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉంటుందని.. నిజం చెప్పాలంటే.. గొప్పగా అనిపించినా తృప్తి మాత్రం లేదని చెప్పేశారు. జాతీయ స్థాయిలో బహుబలికి గుర్తింపు రావటం.. అందులో హీరో ప్రభాస్ తన స్టూడెంట్ కావటం.. క్రిష్ దర్శకత్వం వహించిన కంచెలో హీరో వరుణ్ తేజ్ కూడా తన స్టూడెంట్ కావటం తృప్తి కలిగించే అంశాలుగా చెప్పుకొచ్చారు.
కంచె సినిమాలో హీరో పాత్రకు ఒక రిథమ్ ఉంటుందని.. దాన్ని మొయిన్ టెయిన్ చేయాలంటూ ఆర్టిస్ట్ కు బలం కావాలని.. చేయించేది దర్శకుడే అయినా దాన్ని ఆర్టిస్ట్ చేయకుంటే ఆ పాత్ర పండదని చెప్పారు. చక్రం లాంటి సినిమా చేయాలంటే ప్రభాస్ లో ప్రతిభ లేకుండా కృష్ణవంశీ మాత్రం ఏం చేయలేడని చెప్పిన విషయాన్ని వెల్లడించారు సత్యానంద్. మహేశ్ బాబు కెరీర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని కృష్ణ అడిగినప్పుడు టాప్ త్రీ లో ఉంటారని తాను చెప్పినట్లుగా వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/