Begin typing your search above and press return to search.

25లో చేద్దామనుకుంటే 60 వచ్చేసింది

By:  Tupaki Desk   |   18 July 2015 9:28 AM IST
25లో చేద్దామనుకుంటే 60 వచ్చేసింది
X
కొన్ని పనులు ఎప్పుడో చేయాలనుకుంటాం.. కాని అప్పుడు కుదరదు.. ఎప్పుడో మనం అనుకోనప్పుడు కుదురుతుంది.. మనం బాగా వర్రీ అవుతున్నా కూడా, ఆ పనులు ఎప్పుడు జరుగుతాయో అప్పుడే జరుగుతాయి కాని.. మనం అనుకున్నప్పుడు మాత్రం జరగవు. ఇంతకీ ఈ వేదాంతం అంతా ఏంటి? అక్కడికే వస్తున్నాం ఆగండి.

కట్టప్పగా జనాల మెప్పును పొందేశాడు ఒకప్పటి హీరో, ఇప్పుడు బిజీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సత్యరాజ్‌. అయితే మనోడు ఎప్పుడో చిన్నప్పుడు చేయాలని అనుకున్న రోల్‌ను ఇప్పుడు చేశానంటూ చెప్పుకొచ్చాడు. ''ఎప్పుడు నాకు 25 ఏళ్ళ వయసప్పుడు కత్తి యుద్దాలూ గట్రా నేర్చుకున్నా.. అప్పట్లో ఇలాంటి మైథలాజికల్‌ సినిమాలు చేయాలని అనుకున్నా.. జానపద సినిమాలు కూడా చేశేయాలని కలలుగన్నా.. కాని చివరకు రాజమౌళి ఇచ్చిన బాహుబలి అనే అవకాశం ద్వారా ఎట్టకేలకు 60 ఏళ్ళ వయస్సులో ఇప్పుడు కత్తియుద్దం చేశాను. చాలా గర్వంగా ఉంది'' అంటూ సెలవిచ్చాడు సత్యరాజ్‌.

ఏదో మిర్చి సినిమాలో ప్రభాస్‌ ఫాథర్‌ పాత్రలో చూసి.. మనోడ్ని చాలా యంగ్‌ అనుకునేవారు చాలామందే ఉన్నారు. కాని ఆయన వయస్సు 60 అంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంది దూ.. ఎవరైనా అంతే.. షాక్‌ అయిపోవాల్సిందే.