Begin typing your search above and press return to search.
రాజమౌళి చెప్పాక చంపేయాల్సిందేగా?
By: Tupaki Desk | 28 Jun 2016 2:07 PM GMTదగ్గర దగ్గరగా నాలుగు దశాబ్దాలుగా నట ప్రయాణం చేస్తున్నాడు సత్యరాజ్. హీరోగా - విలన్ గా రకరకాల పాత్రలు పోషించాడు. ఎప్పుడూ ఆయన్ని ప్రేక్షకులు పాత్రల పేర్లతో పిలవలేదట. బాహుబలి తర్వాత నుంచి మాత్రం ఆయన్ని అంతా కట్టప్ప అనే పిలుస్తున్నారు. సత్యరాజ్ అంటే కొంతమంది గుర్తు పట్టలేరేమోకానీ.. కట్టప్ప అంటే మాత్రం ఇట్టే చెప్పేస్తారు. ఆ సినిమా విడుదలైనప్పట్నుంచి సత్యరాజ్ కి ఒకటే ప్రశ్న ఎదురవుతోందట. బాహుబలిని ఎందుకు చంపారని! ప్రపంచమంతా వినిపిస్తున్న ప్రశ్న ఇది.
ఎంతమంది ఎంతగా అడిగినా సత్యరాజ్ మాత్రం చెప్పలేడంతే! అసలే రాజమౌళి. చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్. ఆయన సినిమాలో ఏ విషయం కూడా బయటికి పొక్కదు. టీమ్ ని కూడా అలా ప్రిపేర్ చేస్తుంటారు. పైపెచ్చు ఆ ఒక్క సందేహంపైనే బాహుబలి కన్ క్లూజన్ ఆధారపడింది కాబట్టి సత్యరాజ్ ఆ సీక్రెట్ ని ఎవ్వరి ముందూ విప్పడం లేదు. అయితే ఇటీవల ఆయన మీడియా ముందుకొచ్చినప్పుడు విలేకర్లు ఎంతకీ వదల్లేదు. ఆ ప్రశ్నని గుచ్చి గుచ్చి అడిగేశారు. సరే ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నా. ``రాజమౌళి చెప్పారు కాబట్టే బాహుబలిని చంపేశాను. మీరు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పొందండి`` అంటూ తనదైన స్టైల్ లో పంచ్ పేల్చేసి వెళ్లిపోయారు. మొత్తంగా సత్యరాజ్ ఘటికుడే కదా!!