Begin typing your search above and press return to search.
దేవరకొండ డబ్బింగ్..ఆ లెజెండ్ పొగిడాడు
By: Tupaki Desk | 28 Sep 2018 7:53 AM GMTతెలుగులో చాలామంది స్టార్ హీరోలు కూడా చేయని సాహసం విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో తమిళనాట కూడా తనకు మంచి గుర్తింపు రావడంతో ‘నోటా’ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి తమిళంలోనూ మంచి క్రేజ్ వచ్చింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ సొంతంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అతను పుట్టి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే. తమిళంతో అతడికి పెద్దగా టచ్ లేదు. అయినప్పటికీ తమిళం నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అతడి డబ్బింగ్ విషయంలో చిత్ర బృందం నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. స్వయంగా సత్యరాజ్ లాంటి లెజెండరీ నటుడు దేవరకొండ డబ్బింగ్ సూపర్ అంటున్నాడు. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి తాను పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన విజయ్ ని పొగిడాడు.
‘‘శంకర్ దర్శకత్వంలో నేను నటించిన ‘నన్బన్’ చిత్రాన్ని తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో రిలీజ్ చేశారు. నా పాత్రకు తెలుగులో కూడా నన్నే డబ్బింగ్ చెప్పమని శంకర్ చెప్పారు. నేనూ ప్రయత్నించా. కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పా. ఆ తర్వాత తెలుగు డబ్బింగ్ చెప్పే వ్యక్తి వచ్చి.. సార్ మీరు మాట్లాడింది తెలుగే కాదు. యాస సరిగ్గా లేదని చెప్పారు. అప్పుడే అర్థమైంది. ఎన్ని తెలుగు సినిమాల్లో నటించినా.. ఆ భాష.. యాసకు తగినట్లుగా మాట్లాడడం చాలా కష్టమని. కానీ ‘నోటా’ సినిమాలో ఓ సన్నివేశంలో ఏకంగా రెండు పేజీలున్న డైలాగ్ విజయ్ తమిళంలో చెప్పాల్సి వచ్చింది. అతనెంత ఇబ్బంది పడతాడో అనుకున్నా. కానీ నన్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ మొత్తం డైలాగును కంఠస్థం చేసి.. సరైన యాసతో చెప్పాడు. అతను సక్సెస్ కాబోతున్నాడని చెప్పడానికి అదే రుజువు. మరో భాషలో గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆయన తపనకు అభినందనలు’’ అని సత్యరాజ్ అన్నారు. మరి ఈ సినిమాలో విజయ్ డబ్బింగ్ కి తమిళ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.