Begin typing your search above and press return to search.
కట్టప్ప ఎంత మంచి ఛాన్స్ వదులుకున్నాడో..
By: Tupaki Desk | 12 Aug 2015 11:46 AM GMTసత్యరాజ్ తమిళంలో ఒకప్పుడు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు కానీ.. హీరో వేషాలు తగ్గిపోయాక నెమ్మదిగా ఫేడవుట్ అయిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక మళ్లీ ఆయన కెరీర్ ఊపందుకుంది. ఐతే మరీ చెప్పుకోదగ్గ అవకాశాలేమీ లేవు. ఇలాంటి సమయంలో తెలుగులో ‘మిర్చి’ సినిమా చేసి ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయాడు సత్యరాజ్. ‘బాహుబలి’ సినిమా ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. తమిళ సినీ జనాలు కూడా సత్యరాజ్ ను మనం సరిగా ఉపయోగించుకోవట్లేదే అనే ఫీలింగ్ కలిగించింది ‘బాహుబలి’. తమిళ ఆడియన్స్ ‘బాహుబలి’ని బాగా ఓన్ చేసుకోవడానికి సత్యరాజ్ కూడా ఓ కారణమని చెప్పాలి. ఈ సినిమా విడుదలయ్యాక తమిళంలో కూడా సత్యరాజ్ కు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ఐతే విజయ్ లాంటి పెద్ద హీరో తో సత్యారాజ్ కు పని చేసే అవకాశం వచ్చినా ఆయన ఒప్పుకోకపోవడం విశేషం. దీనికి కారణం ‘బాహుబలి’ సినిమానే. రెండో పార్ట్ కోసం ఇంకా చాలా రోజులు షూటింగులో పాల్గొనాల్సి ఉండటంతో విజయ్ కొత్త సినిమాలో విలన్ వేషం వేయడానికి అంగీకరించలేదు సత్యరాజ్. బాహుబలి లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే చేయగలిగే సినిమా అని.. అది తనకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిందని.. ఆ సినిమా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సత్యరాజ్ తేల్చి చెప్పేశారట. నిజానికి విజయ్ సినిమాలో విలన్ గా చేస్తే సత్యరాజ్ కెరీర్ కోలీవుడ్ లో మరో మలుపు తీసుకుంటుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ‘బాహుబలి-2’ విషయంలో ఆయనకున్న కమిట్ మెంట్ ఆ అవకాశాన్ని తిరస్కరించేలా చేసింది. ఈ సినిమాను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారో చెప్పడానికి వేరే రుజువేముంది?