Begin typing your search above and press return to search.

సత్యరాజ్.. రెమ్యూనరేషన్ పీక్స్ లో ఉందట

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:56 AM
సత్యరాజ్.. రెమ్యూనరేషన్ పీక్స్ లో ఉందట
X
సీనియర్ తమిళ హీరో.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ కు ఇప్పుడు సౌత్ లో సూపర్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా 'బాహుబలి' రెండు భాగాలు ఘన విజయం సాధించడం.. అందులో సత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయి బలమైన ముద్ర వేయడం తో సత్యరాజ్ కు దేశ వ్యాప్తంగా భారీ గుర్తింపు దక్కింది. దీంతో కొన్ని ముఖ్య పాత్రలకు ఫిలిం మేకర్స్ ఆయననే ఎంచుకుంటున్నారు. దీంతో సత్యరాజ్ పారితోషికం పెరిగిపోయిందని టాక్.

సత్యరాజ్ ఒక సినిమాలో నటించాలంటే దాదాపు రూ. 2.5 కోట్లు రెమ్యూనరేషన్ చెల్లించాలి. తమిళ చిత్రానికి ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారు కానీ తెలుగు సినిమా అయితే ఆయనకు డబ్బింగ్ వేరే వ్యక్తి చెప్పాలి. దీంతో ఆ డబ్బింగ్ కోసం మరో పాతిక లక్షల వరకూ అదనంగా ఖర్చు అవుతుందట. అయినప్పటికీ సత్యరాజ్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఫిలిం మేకర్స్ ఇంత ఖర్చుకూ వెనకాడడం లేదట. నిజంగా కూడా సత్యరాజ్ ఒక అద్భుతమైన నటుడు. అయన పర్సనాలిటీ.. స్క్రీన్ ప్రెజెన్స్ ఏ సినిమా కైనా ఒక బలంగా మారతాయి అనడంలో సందేహమే లేదు.

మారుతి-సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' సినిమా కు.. కార్తి సినిమా 'దొంగ' కు ఆయన ఇదే రకమైన రెమ్యూనరేషన్ అందుకున్నారట. సత్యరాజ్ హీరోగా ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు కానీ ఆయనకు అప్పట్లో ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఎప్పుడూ లభించలేదని.. ఆయన కెరీర్ లో అత్యధిక రెమ్యూనరేషన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడే అందుకుంటున్నారని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.