Begin typing your search above and press return to search.
బెస్ట్ దేవుడు ఇతడే అయ్యేట్లున్నాడు
By: Tupaki Desk | 2 Aug 2016 11:30 AM GMTతెలుగునాట దేవుడు అనగానే ఎన్టీఆరే గుర్తొస్తాడు. ఇంకా కొందరు నటీనటులు దేవుళ్ల పాత్రల్లో రాణించారు. కాస్త లేటుగా దేవుడి పాత్రలో మెప్పించిందంటే సుమనే. ‘అన్నమయ్య’లో వెంకటేశ్వరస్వామిగా.. ‘శ్రీరామదాసు’లో శ్రీరాముడిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు సుమన్. నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో మరో భక్తిరస చిత్రం తెరకెక్కుతోందని.. అది కూడా వేంకటేశ్వరస్వామి భక్తుడి నేపథ్యంలోనే అని తెలియగానే అందరికీ సుమనే గుర్తొచ్చాడు.
సుమనే మరోసారి స్వామి పాత్రలో కనిపిస్తాడని అనుకున్నారు. కానీ రాఘవేంద్రరావు మాత్రం ఈసారి మార్పు కోరుకున్నాడు. హిందీ టీవీ నటుడు సౌరభ్ రాజ్ జైన్ ను ఆ పాత్రకు ఎంపిక చేశాడు. ఐతే సుమన్ ను స్వామి పాత్రలో చూసి అలవాటు పడ్డ జనాలు.. పరభాషా నటుడైన సౌరభ్ ను ఆ పాత్రలో చూసి కనెక్టవుతారా అన్న సందేహాలు తలెత్తాయి. కానీ మొన్న వెంకటేశ్వరస్వామిగా సౌరభ్ లుక్ చూశాక మాత్రం ఈ అభిప్రాయం మారిపోయింది.
సౌరభ్ వెంకటేశ్వరస్వామి పాత్రకు భలేగా సరిపోయాడని అంటున్నారు జనాలు. చూడగానే ఆకట్టుకునేలా ఉంది అతడి లుక్. ఇప్పటికే టీవీలో దేవుడి పాత్రలో కనిపించిన సౌరభ్.. ఈజీగా వెంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయినట్లున్నాడు. మేకప్ కూడా బాగా సెట్టయింది. డబ్బింగ్ కూడా సరిగ్గా కుదిరితే ఈ పాత్ర బాగా పండే అవకాశముంది. ఇంతకుముందు సుమన్ కు గాత్రం అందించిన బాలసుబ్రమణ్యమే ఈ పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పే అవకాశముంది. మరి సౌరభ్ నటన.. బాలు వాయిస్ ఎలా ఉంటాయో చూద్దాం.