Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: సవారి.. రియలిస్టిక్ గా ఉందే
By: Tupaki Desk | 23 Jan 2020 11:22 AM GMTనందు.. ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సవారి'. సంతోష్ మోత్కూరి .. నిశాంక్ రెడ్డి కుడితి ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమధ్యే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నందు ఒక పాతబస్తీలో ఉండే తెలంగాణా కుర్రాడిలా కనిపించడం విశేషం.
ట్రైలర్ ఆరంభంలో బాద్షా అనే గుర్రం హైదరాబాద్ రోడ్లపై ఠీవిగా పరిగెడుతూ మీకో గట్టర్ లేపే కథ చెప్తా అంటూ ఇంట్రో ఇస్తుంది. నెక్స్ట్ సీన్ ఊరమాసు గెటప్ లో నందు కనిపిస్తాడు. లుంగీ కట్టుకుని షర్టు లేకుండా గుర్రం దాణా కలుపుతూ ఉంటాడు. ఎవరో పిల్లలు "అన్నా పతంగ్ పడిందే" అని అడిగితే.. "దీపావళి ముందు పతంగ్లేందిరా చల్" అంటూ వారిని కసురుకుంటాడు. ఇక హీరోయిన్ ఒక జనతా బార్ లో నందుతో కూర్చుని ఆరోగ్యానికి హానికరమైన పనులు చేస్తూ "ప్లీజ్ గాడ్ టేక్ మీ అవే. ఐ డోంట్ వాంట్ తో లివ్ ఇన్ దిస్ ఫ.. వరల్డ్" అని భగవంతుడిని వేడుకుంటుంది.
ఓల్డ్ సిటీ రాజు పాత్ర కు నందు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ట్రైలర్ లో పాత్రలు.. ఆ సంభాషణలు.. పాతబస్తీ సహజత్వం ప్రతిబింబించేలా ఉన్నాయి. బోల్డ్ గా ఉండే సీన్లు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. నందు అండర్ వేర్ లో కనిపించడం షాకింగే. ఇక శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమా థీమ్ కు తగ్గట్టుగా ఉంది. మోనిస్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ కూడా ఓల్డ్ సిటీ ఫీల్ తీసుకొచ్చింది. రొటీన్ గా వచ్చే సినిమాల తరహాలో కాకుండా కొత్తగా అనిపిస్తోంది. బాద్షా అనే గుర్రం.. రాజు అనే గుర్రం యజమాని.. అతనికో లవ్ స్టోరీ. దీనికి రియలిస్టిక్ పాత బస్తీ నేపథ్యం. అంతా భిన్నంగా ఉంది. ఆలస్యం ఎందుకు.. ఈ సవారిని చూసేయండి..