Begin typing your search above and press return to search.

సేవ్ ది టైగర్స్… ఫుల్ ఫన్ రైడ్

By:  Tupaki Desk   |   13 April 2023 6:06 PM GMT
సేవ్ ది టైగర్స్… ఫుల్ ఫన్ రైడ్
X
ఈ మధ్యకాలంలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ఎక్కువగా కథలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. జాతిరత్నాలు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే సింగిల్ లైన్ పంచ్ లతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా ఎంటర్టైన్మెంట్ ని అందించారు. ఇదిలా అలాగే ఫ్యామిలీ ఫ్రస్టేషన్ కథలు ఎప్పుడు కూడా వినోదాన్ని అందిస్తూ ఉంటాయి అనే సంగతి తెలిసిందే.

ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా నుంచి మొన్నటి ఎఫ్ 3 మూవీ వరకు ఫ్యామిలీ కథలకి మంచి కాలక్షేపం ఉంటుంది. ప్రేక్షకులు కావాల్సినంత వినోదాన్ని ఆశ్వాదిస్తూ ఉంటారు. తాజాగా సేవ్ ది టైగర్స్ అనే కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం ఇందులో లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు.

వారికి జోడీగా తీన్మార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని నటించారు. అలాగే గంగవ్వ, హర్షవర్ధన్, సద్దాం కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా పెళ్లి తర్వాత భార్యలతో ఇబ్బందులు పడే భర్తలుగా ట్రైలర్ లో చూపించారు. పెళ్ళాల టార్చర్ భరించలేక ఫ్రస్టేషన్ తో బ్రతుకుతున్న ఈ ముగ్గురు కలుసుకోవడం ఇక తమ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవడం వంటి ఎలిమెంట్స్ తో ట్రైలర్ డిజైన్ చేశారు.

అడవుల్లో పులులు అంతరించిపోయినట్లే భవిష్యత్తులో మగవాళ్ళు కూడా అంతరించిపోకుండా కాపాడుకోవాలి అంటూ చైతన్య కృష్ణ చెప్పే డైలాగ్ సినిమా కథలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ని ప్రెజెంట్ చేశారు. సేఫ్ ది టైగర్స్ తరహాలోనే సేవ్ ది మెన్స్ లాంటి ఉద్యమం రావాలని కోరుకునే ముగ్గురు యువకుల కష్టాల కథగా ఈ వెబ్ సిరీస్ ని ఆవిష్కరించారు.

ఇదిలా ఉంటే టీజర్ చూస్తుంటే ఆద్యంతం నవ్వులు పంచె విధంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఏప్రిల్ 27న హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం ఈ కాన్సెప్ట్ క్రియేటర్స్ గా ఉన్నారు. అలాగే దీనికి కథని ప్రదీప్ అద్వైతం, విజయ్ నామోజు, ఎస్ ఆనంద్ కార్తిక్ అందించారు. ఇక తేజ కాకుమాను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.