Begin typing your search above and press return to search.

ఛాన్స్‌ లు లేక వాచ్‌ మన్‌ గా మారిన నటుడు

By:  Tupaki Desk   |   20 March 2019 5:19 PM IST
ఛాన్స్‌ లు లేక వాచ్‌ మన్‌ గా మారిన నటుడు
X
సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం చాలా కామన్‌ గా చూస్తూ ఉంటాం. గతంలో నటులుగా చాలా బిజీగా గడిపిన వారు కొందరు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మనం చాలా సార్లు వార్తల్లో చూశాం. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో స్టార్స్‌ గా వెలుగు వెలిగిన వారు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడం, కొందరు బిక్షమెత్తుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో దయనీయమైన కథలు విన్నాం, ఇప్పుడు బాలీవుడ్‌ కు చెందిన నటుడు సవి సిద్దు గురించి చర్చ జరుగుతుంది. ఒకప్పుడు మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్న సవి సిద్దూ ఇప్పుడు వాచ్‌ మన్‌ గా కాలం వెళ్లదీస్తున్నాడు.

2011వ సంవత్సరంలో అక్షయ్‌ కుమార్‌ నటించిన చిత్రంలో కీలక పాత్ర పోషించిన సవి సిద్దు ఆ తర్వాత పలు సినిమాల్లో నటించాడు. కాని ఇటీవల ఈయనకు అవకాశాలు రావడం లేదు. దాంతో కుటుంబ పోషణ కోసం వాచ్‌ మన్‌ గా ఉద్యోగం చేస్తున్నాడు. సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నా కూడా మంచి ఉద్యోగం దొరకక పోవడంతో పాటు, ఆఫర్లు లేక పోవడం వల్ల సవి సిద్దూ వాచ్‌ మన్‌ గా కాలం వెళ్లదీస్తున్నాడు. సవి సిద్దు గురించి సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా వైరల్‌ అవుతుండటంతో బాలీవుడ్‌ కు చెందిన పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.