Begin typing your search above and press return to search.
సావిత్రి పెళ్లి రహస్యం అలా బయటపడింది
By: Tupaki Desk | 5 May 2018 2:30 PM GMTమహానటి సావిత్రి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక అంతు చిక్కని ప్రశ్నే. దానిపై జనాలకు అనేక సందేహాలున్నాయి. తమిళ కథానాయకుడు జెమెని గణేశన్‌కు ఆకర్షితురాలు కావడం.. ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. డబ్బులన్నీ పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో పడటం.. చివరి రోజుల్లో బాగా ఇబ్బంది పడటం.. ఇలాంటి విషయాలపై జనాలకు స్పష్టమైన సమాచారం లేదు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు సావిత్రి గురించి. ఈ సందేహాలన్నింటికీ ‘మహానటి’ సినిమా సమాధానం ఇస్తుందని.. సావిత్రి జీవితంపై పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సావిత్రి కొడుకు.. కూతురు కూడా ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉండటంతో చాలా వరకు వాస్తవాలు తెలుస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా సినిమాలో కంటే ముందు సావిత్రి జీవితంలోని ఆసక్తికర విషయం ఒకదాన్ని చిత్ర బృందం బయటపెట్టింది.
సావిత్రి రహస్య వివాహం అసలు ఎలా బయటికి వచ్చిందన్నది వెల్లడించారు. జెమిని గణేశన్ ను పెళ్లి చేసుకున్న కొంత కాలానికి సావిత్రి ఒక కార్యక్రమంలో పాల్గొని.. అక్కడ సంతకం చేయాల్సి వచ్చిందట. తెలిసి చేసిందో తెలియక చేసిందో కానీ తన పేరును అక్కడ ‘జెమిని గణేశన్’గా పేర్కొందట సావిత్రి. ఆ విషయం బయటికి పొక్కి పత్రికల్లో ఇది పెద్ద వార్త అయింది. ఆ తర్వాత అటు సావిత్రి.. ఇటు జెమిని గణేశన్ ఇద్దరూ తమ పెళ్లి గురించి అంగీకరించారు. మరోవైపు సావిత్రి జీవిత చరమాంకంలో ఆమె ఆరోగ్యం గురించి తనయురాలు విజయ ఛాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. సావిత్రి అనారోగ్యంతో 19 నెలల పాటు కోమాలో ఉన్నట్లు చెప్పింది. ఆ సమయంలో తన తండ్రి ఆమెను పట్టించుకోలేదన్న సంగతి అబద్ధమని అంది. ఆ 19 నెలలూ ఆయన బాధ పడని రోజు లేదంది. సావిత్రికి ముందే షుగర్ ఉండేదని.. దీనికి తోడు వేరే ఆరోగ్య సమస్యలు.. ఒత్తిళ్లు తోడై ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని చాముండేశ్వరి చెప్పింది.