Begin typing your search above and press return to search.
సావిత్రి ర్యాష్ డ్రైవింగ్ చేసేదట!!
By: Tupaki Desk | 19 April 2018 9:30 AM GMTఒక్క ముక్క మాట్లాడకుండా... కళ్లతోనే మనసులో ఉన్న ఫీలింగ్ ను స్పష్టంగా పలికించగల నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మహానటి సావిత్రి ఒకరు. ఆమె అందం- అభినయం- ఆహార్యం అన్నీ ప్రత్యేకమే. అప్పట్లో జాతీయ అవార్డులు ఉండి ఉంటే... సావిత్రి నటనకి ఎన్ని అవార్డులు వచ్చి ఉండేవో. ఇప్పుడు ఆ అద్భుత నటి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే నటిగా వెండి తెరపై ఎంత వెలుగు వెలిగిందో... నిజ జీవితంలో అంత చీకట్లోకి కూరుకుపోయింది సావిత్రి. ఈ సినిమాలో ఆ చీకటి రోజులను చూపించే అవకాశం ఉందో లేదో తెలీదు కానీ సావిత్రికి సంబంధించిన ఓ విషయం గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తారట. అదే ర్యాష్ డ్రైవింగ్. లెఫ్ట్ హ్యాండర్ అయిన సావిత్రి... అప్పట్లో కారుని అతి వేగంగా నడిపేదట. ఆమె కారుకి ఓ డ్రైవర్ ఉండేవాడు. కానీ ఆమెనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చేదని... అది కూడా చాలా స్పీడుగా నడిపేదని చెప్పారట సావిత్రితో కలిసి పనిచేసిన సీనియర్ నటీనటులు. సావిత్రి డ్రైవింగ్ చూసి ఆమె పక్కన కూర్చోవాళ్లంటే మిగిలిన నటులు భయపడేవాళ్లుట. అంతేకాదండోయ్ ప్రొఫెనల్ డ్రైవర్లు 40 నిమిషాల్లో స్టూడియోకి వస్తే... సావిత్రి మాత్రం 20 నిమిషాల్లోనే చేరుకునేదట. అంటే డబల్ స్పీడుతో అనమాట.
సావిత్రి చూడడానికి మహా సౌమ్యంగా కనిపిస్తారు. అలాంటి మహానటి ఇంత స్పీడుగా డ్రైవింగ్ చేసేదంటే నమ్మకం కష్టమే. అయినా సావిత్రి రోజుల్లో కార్లు చాలా తక్కువ. ఎక్కడో ఓ కొత్త కారు కనిపిస్తే... వింతగా చూసే రోజులవి. అలాంటి టైమ్ లో వేగంగా నడపడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ జీవితంలో ఎన్నో కష్టాలను చూసిన సావిత్రిగారు డ్రైవింగ్ లో మజాని కోరుకునేవారేమో... అనుకుంటున్నారు నేటితరం కుర్రాలు. మహానటి సినిమా మే 9న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సావిత్రి గురించి ఇంకెన్ని తెలియని విషయాలు చూపిస్తారో చూడాలి.