Begin typing your search above and press return to search.
మహానటి సమయం సెట్టయ్యింది
By: Tupaki Desk | 8 May 2018 6:05 AM GMTటాలీవుడ్ లో సినిమాల రన్ టైమ్ ల విషయంలో ఊహించని మార్పులు చోటు చెసుకుంటున్నాయి. ఒక దశలో రెండు గంటల సినిమానే చాలు అనుకుంటున్నా వారు ఆ తరువాత మూడు గంటలకు సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని తరహాలో ఆలోచించి సినిమా నిడివిని పెంచుతున్నారు అభిమానులు కూడా మూడు గంటలు ఇష్టం ఉంటే చూసేస్తున్నారు. ఇప్పుడు మహానటి నిడివి కూడా అదే రేంజ్ లో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సావిత్రి బయోపిక్ బుధవారం రిలీజ్ కానుంది.
అయితే ఇటీవల సెన్సార్ పనులను కూడా చిత్ర యూనిట్ ఫినిష్ చేసుకుంది. ఇక సినిమా నిడివి సమయాన్ని 176 నిమిషాలకు సెట్ చేసుకుంది. అంటే రెండు గంటల 56 నిమిషాలు. 300 కు పైగా చిత్రాల్లో నటించిన సావిత్రి జీవితాన్ని తెరపై చూపించాలంటే చాలా కష్టం. ఎంత తీసిన సరిపోదు. అయితే దర్శకుడు ఆమెకు సంబంధించిన 11 చిత్రాల కీలక సన్నివేశాలను తీసుకొని.. ఎక్కువగా వ్యక్తిగత గత జీవితాన్ని చూపించేందుకు ప్రయత్నం చేశాడు. దాదాపు మూడు గంటల వరకు నిడివి సమయాన్ని లాక్ చెసుకున్నాడు అంటే పెద్ద ప్రయోగమనే చెప్పాలి.
ఇటీవల వచ్చిన రంగస్థలం అలాగే భరత్ అనే నేను సినిమాలు కూడా నిడివి సమయాన్ని దాదాపు ఇదే రేంజ్ లో కలిగి ఉన్నాయి. ఆ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంకా సన్నివేశాలను యాడ్ చేయమని డిమాండ్ కూడా వచ్చింది. మరి ఆ స్టార్ హీరోల సినిమాలను యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులు మహానటి సినిమాను ఎంతవరకు చూస్తారో చూడాలి.