Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: రిషి-సావిత్రి ప్రేమకథ
By: Tupaki Desk | 2 Jan 2016 2:05 PM GMTగాఢంగా ప్రేమించుకుంటున్న రిషి.. ప్రియురాలు సావిత్రిల.. ప్రేమకథ ఎన్ని మలుపులు తిరిగింది? ఎలాంటి ఎండింగ్ ను చవిచూసింది? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఓ మారు మనం నారా రోహిత్ దగ్గరకు వెళ్లి రావల్సిందే. ఎందుకంటే మనోడు ఇప్పుడు ''సావిత్రి'' ఫస్ట్ లుక్ తో వచ్చేశాడు మరి.
ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమా పెద్ద హిట్టు కాదు. కాకపోతే ఒక ఫీల్ గుడ్ సినిమాగా బాగానే పేరొచ్చింది. అందుకే దర్శకుడు పవన్ సాదినేని చెప్పిన కథకు వెంటనే ఛాన్సిచ్చేశాడు రోహిత్. కొత్తరకం సినిమాలను తీయడానికి మనోడు ఎప్పుడూ ముందుంటాడనే విషయం తెలిసిందేగా. ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ లుక్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.. నిజంగానే పోస్టర్ చూస్తే ఇదో గాఢమైన ప్రేమకథ అని అర్ధమైపోతుంది.
మరి రిషి క్యారెక్టర్ లో రోహిత్.. అలాగే సావిత్రి క్యారెక్టర్ లో తెలుగమ్మాయ్ నందిత ఎలా చేశారో తెలియాలంటే సినిమా కోసం వెయిటింగ్ చేయక తప్పదు.