Begin typing your search above and press return to search.

‘‘సావిత్రి’’ రాకకు డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   25 Jan 2016 12:47 PM GMT
‘‘సావిత్రి’’ రాకకు డేట్ ఫిక్స్
X
విభిన్నత్వానికి పెద్దపీట వేస్తూ.. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండాలన్న తపన హీరో నారా రోహిత్ చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం బాణం నుంచి చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకోవటం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘‘సావిత్రి’’.

ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం పవన్ సాదినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రోహిత్ సరసన నందిత నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈ చిత్రం గురించి మాట్లాడిన నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్.. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని.. చిత్రంలో హీరో.. హీరోయిన్ల జంట చూడచక్కగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. రోహిత్ తాజా చిత్రం లవ్ అండ్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించినట్లు పేర్కొన్నారు. మరి.. దర్శక నిర్మాతలు చెప్పిన రేంజ్ లో సినిమా ఉందా లేదా అనేది తేలాలంటే మార్చి 25 వరకు వెయిట్ చేయాల్సిందే.