Begin typing your search above and press return to search.

‘సావిత్రి’ స్క్రీన్లు పెరిగాయి

By:  Tupaki Desk   |   5 April 2016 11:30 AM GMT
‘సావిత్రి’ స్క్రీన్లు పెరిగాయి
X
మొన్న ‘తుంటరి’ మూవీతో అలరించిన నారా రోహిత్... ఇప్పుడు ‘సావిత్రి’ మూవీతో ప్రేక్షలను అలరిస్తున్నాడు. దర్శక కేంద్రుడు రాఘవేంద్రరావు సైతం ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తాడు. మొదట్లో ఈ సినిమాకు కొంత డివైడ్ టాక్ వచ్చినా... ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ‘ఊపరి’ సినిమా విడుదలై ఎలాగూ రెండు వారాలు దాటింది. దాంతో ఇప్పుడు విడుదలైన కొత్త సినిమాల్లో సావిత్రి ఒక్కటే బాగుండటంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ బాగుంటంతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా వుంది.

ముండు వేసవిలో విడుదలైన ‘సావిత్రి’కి ప్రమోషన్ తో పాటు... థియేటర్లను కూడా పెంచింది చిత్ర యూనిట్. ‘సోలో’ సినిమా తరువాత నారా రోహిత్ నటించి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇది. ఇందులో నారా రోహిత్ చేసిన రిషి క్యారెక్టర్ బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ ఎపిసోడ్ కామెడీ... క్లైమాక్స్ లో పలికించిన భావోద్వేగాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. వారాంతం తరువాత కలెక్షన్లు కూడా స్టడీగా వుండటం వల్ల... ఈ చిత్రాన్నిరేపటి నుంచి మరో 36 థియేటర్లలో ప్రదర్శించడానికి అనుమతులు తీసుకున్నారట. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల దాకా సావిత్రి... విడదలైన అన్ని థియేటర్లలో సందడి చేయనుందన్నమాట.