Begin typing your search above and press return to search.
మహానటి నిజమైన కుటుంబం
By: Tupaki Desk | 2 May 2018 5:34 AM GMTఎవర్ గ్రీన్ స్టార్ సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి ఆడియో వేడుక అన్ని రకాల ఎమోషన్స్ కు వేదికగా మారింది. స్టార్లు గెస్ట్ లుగా రావడం కామనే కాబట్టి ఇందులో అందరి దృష్టిలో ప్రత్యేకంగా గుర్తింపబడ్డ వాళ్ళు మాత్రం సావిత్రి గారి కుటుంబ సభ్యులు. నిజానికి వీళ్ళు ఎలా ఉంటారో బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారని తెలుసుగాని ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి అవగాహన లేదు. నిన్న వేడుకలో అందరికి సముయోచిత స్థానం కల్పించడం ఆహుతులను ఆకట్టుకుంది. సావిత్రి గారి అబ్బాయి సతీష్ మాట్లాడుతూ అమ్మ బయోపిక్ తీస్తారని తెలిసినప్పుడు మళ్ళి విషాదాన్ని తెరపై చూపుతారేమో అని భయపడ్డానని నాగ అశ్విన్ ని కాసేపు కలుద్దాం అనుకున్న సమయంలో రెండు గంటల ఇంటరాక్షన్ కాస్త రెండు రోజుల దాకా సాగిందని గుర్తు చేసుకున్నారు.
నాగ అశ్విన్ కథ చెబుతున్నంత సేపు కంట్లో నీళ్ళు వచ్చాయని బాధతో కాదని ఇలా కూడా సావిత్రి గారి కథను చెప్పొచ్చా అనిపించని మెచ్చుకున్నారు. అమ్మ చెబుతున్నట్టుగా కథను ఆమె కోణంలో చెప్పడం తనను బాగా ఆకట్టుకుందని చెప్పిన సతీష్ చివరికి థాంక్స్ చెప్పి ముగించారు. ఇక తర్వాత మైక్ అందుకున్న కూతురు విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ తన భర్త సావిత్రి అల్లుడు గోవింద రావుతో పాటు పెద్దబ్బాయి అరుణ్ భార్యా పిల్లలు రెండో అబ్బాయి అభినయ్ వాళ్ళ కూతురు స్వస్తికలను స్వయంగా పరిచయం చేసి మాట్లాడేందుకు మాటలు లేవని చెప్పి అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు. బయట ప్రపంచానికి ఇన్నాళ్ళు తెలియకుండా విదేశాల్లో స్థిరపడిన సావిత్రి గారి కుటుంబ సభ్యులు మహానటి ఆడియో వల్ల ఒకే వేదికపై అందరిని చూసే అవకాశం దక్కింది.
వీడియో కోసం క్లిక్ చేయండి