Begin typing your search above and press return to search.
సవ్యసాచి టీం.. లబ్ డబ్ లబ్ డబ్
By: Tupaki Desk | 2 Nov 2018 5:02 AM GMTకొంత విరామం తర్వాత తెలుగులో మళ్లీ కొంచెం పెద్ద స్థాయి సినిమా వస్తోంది. అక్కినేని నాగచైతన్య హీరోగా యువ దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన ‘సవ్యసాచి’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘శ్రీమంతుడు’.. ‘జనతా గ్యారేజ్’.. ‘రంగస్థలం’.. ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. ఇక చందూ తీసిన రెండు సినిమాలూ మంచి విజయాలే సాధించాయి.
అందులో చైతూ కాంబినేషన్లో అతను తీసిన ‘ప్రేమమ్’ అందులో ఒకటి. దీనికి తోడు ఈ చిత్ర కథాంశం.. దీని ప్రోమోలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఇలా ఈ సినిమాకు అన్నీ సానుకూలంగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇదొక వినూత్న కథాంశంతో తెరకెక్కింది. ఇలాంటి ప్రయోగాలు చేసినపుడు జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సినిమా విడుదలయ్యే వరకు చెప్పలేం.
హీరో ఎడమ చేయి అతడి మాట వినకపోవడం అనే వినూత్నమైన కథాంశంతో ‘సవ్యసాచి’ తెరకెక్కింది. ఇది వినడానికి బాగున్నా.. ప్రోమోల వరకు ఓకే అనిపించినా.. దీన్ని సినిమాలో ఎలా డీల్ చేశారన్నది చూడాలి. ఈ పాయింట్ వింటే ఇదొక విభిన్నమైన థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. హాలీవుడ్ స్థాయిలో ఊహించుకుంటాం. కానీ చందూ దీన్ని కొంచెం కమర్షియల్ స్టయిల్లో డీల్ చేయడానికి ప్రయత్నించినట్లున్నాడు. ఇలా ట్రై చేసినపుడు సినిమా అంత గ్రిప్పింగ్ ఉంటుందా అన్నది డౌటు. కొన్ని రకాల కథాంశాలకు ఎలా పడితే అలా ట్రీట్మెంట్ ఇస్తే నడవదు. కాబట్టి ‘సవ్యసాచి’ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ముందే చెప్పలేం. ఇక క్రేజీ కాంబినేషన్ కుదిరినా కూడా సినిమాకు రిలీజ్ ముంగిట ఆశించినంత హైప్ రాలేదు. బుకింగ్స్ ఓ మోస్తరుగానే ఉన్నాయి. చైతూ గత సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’ స్థాయిలో దీనికి ఓపెనింగ్స్ రావడం సందేహమే. సినిమాకు టాక్ ఎలా ఉంటుందన్నది చాలా కీలకం. ఈ విషయంలో సవ్యసాచి టీం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.