Begin typing your search above and press return to search.
RAW-NIA ఏజెంట్ గుట్టు మొత్తం లీక్ చేసిన హీరోయిన్
By: Tupaki Desk | 28 March 2021 11:30 AM GMTమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తొలి పరిచయ చిత్రం `రేయ్`లో నటించారు మోడల్ సయామీ ఖేర్. వైవియస్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనూహ్య డిజాస్టర్ సాయి తేజ్ కంటే సయామీకి పెద్ద మైనస్ అయ్యింది. వైవియస్ కి ఆ తర్వాత కెరీర్ జీరో అయినట్టే సయామీకి తెలుగులో ఆఫర్లు లేవు.
ఆ క్రమంలోనే సయామీ పూర్తిగా మరాఠీ హిందీ చిత్రాల వైపు దృష్టి సారించారు. చాలా గ్యాప్ తర్వాత తిరిగి టాలీవుడ్ లో ప్రవేశించే అవకాశం అదృష్టం తన ఇంటి తలుపు తట్టింది. కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో రా ఏజెంట్ గా యాక్షన్ పాత్రలో అవకాశం దక్కింది. ఎన్.ఐ.ఏ అధికారులు రా వింగ్ లో పని చేసే మహిళా అధికారిగా సయామీ విన్యాసాలు తెరపై ఆద్యంతం రంజింపజేయనున్నాయి.
అసలు వైల్డ్ డాగ్ లో అవకాశం ఎలా వచ్చింది? ఇందులో మీ పాత్ర ఏమిటి? అని సయామీనే ప్రశ్నిస్తే దానికి సమాధానమిచ్చారు. రా ఏజెంట్ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఆర్య పండిట్ పాత్రను పోషించాను. నాగ్ సర్ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్ విజయ్ వర్మ పాత్రలో కనిపిస్తారు. నేను రా ఏజెంట్ అయిన నాగ్ సర్ నేతృత్వంలోని NIA బృందంతో ఎందుకు పని చేయాల్సి వచ్చింది? అనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంటుంది. నిజానికి నేను నాగ్ సర్ కి అభిమానిని. శివ చిత్రం చూశాను. ఆయన చిత్రాల్లో గీతాంజలి అంటే పడి చస్తాను. ఈ సినిమా చేయడానికి ముందు నేను నాగ్ సార్ ను కలవలేదు. మా మొదటి కలయిక డైరెక్టుగా ఒక ఉగ్రవాదిని విచారించే సీన్ తోనే. నాగ్ సర్ ఇంత పెద్ద స్టార్ కావడంతో మొదట్లో నాకు కాస్త భయంగా అనిపించింది. కానీ అతను సెట్స్ లో చాలా హ్యాపీ మ్యాన్. చాలా వినయవిధేయత ఉన్న స్టార్.. చాలా ప్రోత్సహించారు అని తెలిపారు.
దర్శకుడు ఆశిషోర్ సోలమన్ ఆడిషన్స్ లో ఎంపిక చేసుకున్నారని.. క్రీడాకారిణిగా కొనసాగిన అనుభవం ఏజెంట్ పాత్రకు సరిపోయిందని సయామీ వెల్లడించారు. ``కథ.. నా పాత్ర నచ్చాయి. నటించాను.. సాధారణంగా హీరోయిన్లకు పెద్ద యాక్షన్ సన్నివేశాలు ఉండవు. కానీ ఈ సినిమాలో నాకు చాలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. నాగ్ సార్ తో చేజింగ్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలను ప్రదర్శించడానికి నా ఫిట్ నెస్ నాకు సహాయపడింది`` అని తెలిపారు.
ఎన్.ఐ.ఏ శిక్షణ గురించి చెబుతూ.. షూట్ ప్రారంభించే ముందు.. నేను ముంబైలో మార్షల్ ఆర్ట్స్ లో ఒక నెల శిక్షణ తీసుకున్నాను. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్ ఉత్కంఠకు గురి చేస్తాయి... అని తెలిపారు. ప్రభాస్- అల్లు అర్జున్ లాంటి స్టార్లతో పనిచేయాలనుందని అన్నారు. రాజమౌళి- మణిరత్నం నా అభిమాన దర్శకులు అని కూడా తెలిపారు