Begin typing your search above and press return to search.

హీరోయిన్ బ్రా సైజు అడిగిన నెటిజ‌న్‌.. ఏం చూపించిందంటే?

By:  Tupaki Desk   |   8 April 2021 6:30 AM GMT
హీరోయిన్ బ్రా సైజు అడిగిన నెటిజ‌న్‌.. ఏం చూపించిందంటే?
X
ఎక్క‌డో ఉండి కామెంట్ చేస్తున్నాం కాబ‌ట్టి ఏమైనా అనేయొచ్చు.. ఏదైనా అడిగేయొచ్చు.. అనే ఆవారా బ్యాచ్ సోష‌‌ల్ మీడియాలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి రెచ్చిపోతున్నారు. ఇష్టారీతిన వ‌ల్గ‌ర్ కామెంట్లు చేయ‌డం అల‌వాటుగా మారిపోయింది కొంద‌రికి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది హీరోయిన్లు, న‌టీమ‌ణులపై అస‌భ్య కామెంట్లు చేశారు. తాజాగా బాలీవుడ్ యువ‌న‌టిని టార్గెట్ చేశాడో ఆకతాయి.

హీరోయిన్ల న్యూడ్ చిత్రాలు కావాల‌ని, బాడీ సైజులు చెప్పాల‌ని ఇష్టారీతిన అడిగేస్తున్నారు. గ‌తంలో హీరోయిన్ పూజా హెగ్డేను న్యూడ్ ఫొటో అడిగాడో నెటిజ‌న్‌. దీంతో.. ఆమె పాదాల‌ను ఫొటో తీసి కామెంట్ బాక్స్ లో పోస్టు చేసింది. ఈ ఆన్స‌ర్ కు నోట‌మాట రాలేదు అత‌నికి.

ఈ మ‌ధ్య హీరోయిన్ ప్రియ‌మ‌ణి సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోకు కామెంట్ చేసిన ఓ వ్య‌క్తి.. న్యూడ్ ఫొటో కూడా పోస్టు చేయాల‌ని అన్నాడు. దీంతో.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన ప్రియ‌మ‌ణి.. దిమ్మతిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. ‘ముందుగా మీ అక్క‌ను, అమ్మ‌ను న్యూడ్ ఫొటోల‌ను పోస్టు చేయ‌మ‌ని చెప్పు. ఆ త‌ర్వాత నేను పోస్టు చేస్తాను’ అని రిప్లే ఇచ్చింది.

తాజాగా.. వ‌ర‌ల్డ్ హెల్త్ డే సంద‌ర్భంగా ఫాలోవ‌ర్లతో మాట్లాడుతూ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తోంది టీవీ న‌టి స‌యాంత‌ని ఘోష్‌. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌స్త‌త్వాన్ని బ‌య‌ట‌పెట్టాడో నెటిజన్. నీ బ్రా సైజ్ ఎంత‌? అని ప్ర‌శ్నించాడు. దీనికి అద్దిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది స‌యాంత‌ని.

‘వ‌ర‌ల్డ్ హెల్త్ డే రోజున మాన‌సిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్య‌మో తెలిసివ‌చ్చింది. నువ్వు మాన‌సికంగా కూడా ఫిట్ ఉండాలి. నువ్వు నా బ్రా సైజు అడిగావు.. నేను కూడా నీలాగే నీ పురుషాంగం సైజు ఎంత అంటే నీ ముఖం ఎక్క‌డ పెట్టుకుంటావు?’ ఘాటుగా రిప్లే ఇచ్చింది. ఈ స‌మాధానం ఇచ్చిన స‌యాంత‌ని ఘోష్ ను చాలా మంది అభినందించారు. బ్రా సైజు అడిగితే.. మెచ్యూరిటీని చూపించిన న‌టిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అలాంటి వారికి ఇలాగే ఆన్స‌ర్ ఇవ్వాల‌ని కామెంట్ చేస్తున్నారు.