Begin typing your search above and press return to search.

అఖిల్ హీరొయిన్ పెళ్లి ఫిక్స్!?

By:  Tupaki Desk   |   31 Jan 2019 7:55 AM GMT
అఖిల్ హీరొయిన్ పెళ్లి ఫిక్స్!?
X
అక్కినేని అఖిల్ మొదటి సినిమా హీరొయిన్ సాయేషా సైగల్ గుర్తుందిగా. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అని ప్రచారం జరుగుతుంది . ఇప్పటిదాకా తన ప్రేమ కథ గాలి వార్త రూపంలో చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి అఫీషియల్ గా చెక్ పెట్టేసారు అని ఒక వార్త ప్రచారం జరుగుతుంది . తమిళ్ హీరో ఆర్యని సాయేషా మనువాడనుంది అనేది ఆ వార్త . ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే అంట . మార్చ్ 9-10 తెదీలలో గ్రాండ్ గా కళ్యాణంతో పాటు రిసెప్షన్ కూడా ప్లాన్ చేసారు అని అంటున్నారు . ఈ ఇద్దరు ప్రకటించలేదు కాని ఆ మేరకు సన్నిహితంగా ఉండే కోలీవుడ్ టాలీవుడ్ హీరో హీరొయిన్లకు నటీనటులకు సమాచారం ఇచ్చారట. అందుబాటులో ఉండటంతో పాటు ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ లాంటి ముందస్తు ఏర్పాట్ల కోసం ఆల్రెడీ చెప్పేసారట.

తమిళనాట ఈ ఇద్దరి లవ్ స్టొరీ చాలా నెలల నుంచి హాట్ టాపిక్ గా ఉంది. బయట కలిసి తిరుగుతున్నా ఎప్పుడు బయట చెప్పుకోని ఈ జంట మొత్తానికి మూడు ముళ్ళకు త్వరగానే వెళ్ళడం విశేషం. ఆర్య మనకూ సుపరిచితుడే. అల్లు అర్జున్ లో మెయిన్ విలన్ గా చేసింది ఇతగాడే. వాడు వీడు-నేనే అంబానీ లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా ఇక్కడ కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు.

అయితే అఖిల్ డిజాస్టర్ తర్వాత సాయేషాకు ఇక్కడ ఆఫర్లు రాలేదు. దాంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయి కెరీర్ తో పాటు లైఫ్ ని కూడా సెటిల్ చేసుకుంది. ఇప్పుడీ జంట కరుప్పన్ లో నటిస్తున్నారు. సూర్య-మోహన్ లాల్ కీలక పాత్రలో రంగం ఫేం ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఇందులో ఛాన్స్ వచ్చేలా ఆర్య స్పెషల్ గా సూర్య ద్వారా రికమండ్ చేసాడని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఏదైతేనేం మరో సినిమా జంట ఒక్కటి కాబోతోంది