Begin typing your search above and press return to search.

ఇక్కడ ఆడుకుని.. అక్కడ వాడుకుంటున్నారు

By:  Tupaki Desk   |   17 Jun 2016 4:34 AM GMT
ఇక్కడ ఆడుకుని.. అక్కడ వాడుకుంటున్నారు
X
ఏ హీరో అయినా హీరోయిన్ అయినా తొలి సినిమాతో ఇరగదీసేసేలా యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఎవరో ఒకరిద్దరు మినహాయిస్తే.. మొదటి మూవీతోనే సూపర్బ్ అనిపించుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. బాలీవుడ్ లో హీరోయిన్లకు ఇలా ఫస్ట్ పిక్చర్ తో తేడా వస్తే.. తర్వాత కోలుకోవడం కష్టం. అందుకే మన టాలీవుడ్ జనాల వెర్రిని బాగానే క్యాష్ చేసేసుకుంటున్నారు.

అరంగేట్రంలో తెలుగు సినిమా చేస్తామంటే.. అర్హతకు మించిన ఆఫర్ ఇచ్చి పెద్ద మొత్తం కట్టబెట్టేందుకు క్యూలో ఉంటారు తెలుగు ఇండస్ట్రీ పెద్దలు. అందుకే కొందరు ఇక్కడ తెరంగేట్రం చేసి అనుభవం సంపాదించి.. ఆనక తీరిగ్గా బాలీవుడ్ లో రెచ్చిపోతున్నారు. ఒక లైలా కోసం అంటూ తొలి సినిమా చేసిన పూజా హెగ్డే.. ఆ తర్వాత ముకుందలో కూడా మెరిసింది. నెక్ట్స్ జాక్ పాట్ కొట్టేసి హృతిక్ సరసన మహెంజొదారో మూవీలో లీడ్ రోల్ లో తేలింది.

అఖిల్ డిబట్ మూవీ తో అరంగేట్రం చేసిన సాయేషా సైగల్ ది కూడా సేమ్ సిట్యూయేషన్. రెండో సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తీస్తున్న 'శివాయ్' లో సెలక్ట్ అయింది. 'రేయ్' అంటూ సాయిధరంతేజ్ తో స్టార్ట్ చేసి.. ఇప్పుడు 'మిర్జియా' అంటూ అనిల్ కపూర్ కొడుకు ఎంట్రీ ఇస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ పట్టేసింది. ఇలా వచ్చీ రాని నటనతో తెలుగోళ్లతో ఆడేసుకుని.. ఆ అనుభవాన్ని, ట్యాలెంట్ ని బాలీవుడ్ లో బాగా వాడేసుకుంటున్నారు ఈ అందాల భామలు.