Begin typing your search above and press return to search.

మ్యారీడ్ బ్యూటీ చ‌బ్బీ లుక్ టెంప్టింగ్

By:  Tupaki Desk   |   18 March 2020 12:00 PM GMT
మ్యారీడ్ బ్యూటీ చ‌బ్బీ లుక్ టెంప్టింగ్
X
హీరో ఆర్య‌- స‌యేషా సైగ‌ల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది మార్చిలో పెళ్లి చేసుకుని దాంప్య‌త జీవితంలోకి అడుగు పెట్టారు. సంసారంలో స‌రిగ‌మ‌ల్ని ఆస్వాధిస్తున్న ఈ అమ్మ‌డు తిరిగి ముఖానికి రంగేసుకుని సినీ కెరీర్ ప‌రంగా జోరు పెంచే ప్లాన్ లో ఉంది. మ్యారీడ్ బ్యూటీస్ కి టాలీవుడ్ ఎలాగూ అవ‌కాశాలివ్వ‌దు కాబ‌ట్టి స‌యేషా పూర్తిగా కోలీవుడ్ స‌హా క‌న్న‌డ సినిమాల‌ పైనే దృష్టి పెట్టింది. ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో పునీత్ రాజ్ కుమార్ స‌ర‌స‌న యువ‌ర‌త్న అనే సినిమాలో న‌టిస్తోంది.

అమ్మ‌డికి క‌న్న‌డంలో డెబ్యూ మూవీ. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉంది యూనిట్. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే అమ్మ‌డు కొత్తందంతో క‌న్న‌డ అభిమానుల‌ను ఫిదా చేస్తోంది. తాజాగా విడుద‌లైన స‌యేషా ఫ‌స్ట్ లుక్ స‌హా డైలాగ్ టీజ‌ర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. స్టార్ హీరోని ప‌ట్టించుకోకుండా.. మ్యారీడ్ స‌యేషా అందంగా...ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోందంటూ కామెంట్లు ప‌డుతున్నాయి. పునీత్ లో మాస్ యాంగిల్ ని...వీరోచిత యాక్ష‌న్ దృశ్యాల‌ను పొగిడేయ‌డం మ‌రిచిన ఫ్యాన్స్ స‌యేషా గురించే క‌ల‌వ‌రించారు. పెళ్లైన త‌ర్వాత తెర‌పై మేలిమి ఛాయ‌తో త‌ళ‌త‌ళ‌లాడుతోంద‌ని తెగ పొగిడేస్తున్నారు.

తాజా మూవీలో స‌యేషా పూర్తిగా సాంప్ర‌దాయ‌ చీర‌క‌ట్టులో ఆక‌ట్టుకోనుంది. పెళ్లి త‌ర్వాత చ‌బ్బీ లుక్ లోకి మార‌డం త‌న‌కు ప్ల‌స్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. పెళ్లికి ముందు స‌న్న‌ జాజిలా ఉండే స‌యేషా ఇప్పుడిలా బొద్దుగా తెర‌పై క‌నిపించ‌డ‌మే సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచేలా ఉంది. మొత్తానికి అమ్మ‌డు క‌న్న‌డ అభిమానులకు తొలి ప్ర‌య‌త్నంలోనే ఇంప్రెసివ్ గా క‌నిపించి ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంతోష్ ఆనంద‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.