Begin typing your search above and press return to search.

కోలీవుడ్ కు నచ్చిన అఖిల్ హీరోయిన్

By:  Tupaki Desk   |   6 Nov 2017 5:21 AM GMT
కోలీవుడ్ కు నచ్చిన అఖిల్ హీరోయిన్
X
బాలీవుడ్ నాటి తరం గొప్ప నటుడైన దిలీప్ కుమార్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది సుందరాంగి సాయేషా సైగల్. అక్కినేని వారసుడైన అఖిల్ తొలి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టడంతో అమ్మడికి ఇక్కడకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయి అజయ్ దేవగన్ సినిమా శివాయ్ లో నటించింది. ఆ సినిమా బాగానే ఆడినా సాయేషా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు.

దీంతో మళ్లీ అవకాశాల కోసం సౌత్ వచ్చిన సాయేషాకు కోలీవుడ్ మంచి ఆహ్వానం పలికింది. జయం రవి హీరోగా వనమగన్ సినిమా చేసింది. ఇవికాక మరో రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. తాజాగా సాయేషాకు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం వచ్చిందని టాక్. పాండ్యరాజ్ డైరెక్షన్ లో విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో కార్తి హీరోగా నటిస్తున్న సినిమాలో సాయేషా ను ఎంచుకున్నట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాలో మరో ఇధ్దరు హీరోయిన్లు నటించనున్నారు. మరో హీరోయిన్ గా మళయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పేరును పరిశీలిస్తున్నారు.

తాజా ఆఫర్ తో సాయేషా తక్కువ టైంలోనే కార్తి పక్కన మరోసారి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె కార్తితో కలిసి కరుప్పు రాజా.. వెల్లై రాజా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విశాల్ కూడా హీరోయిన్ గా నటిస్తున్నాడు. ఈ కామెడీ ఎంటర్ టెయినర్ ను ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతోపాటు విజయ్ సేతుపతి సినిమా జుంగాలోనూ సాయేషా హీరోయిన్ గా చేస్తోంది. సాధారణంగా కార్తి సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటాయి. ఈ రకంగా తెలుగువాళ్ల మరోసారి అఖిల్ భామను చూసే అవకాశం ఉంది.