Begin typing your search above and press return to search.
అఖిల్ ఫెయిల్యూర్ కి కారణం చెప్పేసింది
By: Tupaki Desk | 27 Dec 2015 6:31 AM GMTఅక్కినేని చియాన్ అఖిల్ సరసన కథానాయికగా నటించింది సయేషా సైగల్. అందానికి అందం, చక్కని ప్రతిభ ఉన్న నాయికగా పేరు తెచ్చుకుంది. అయితే దురదృష్టం కొద్దీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అఖిల్ -సయేషా పెయిర్ బావుంది కానీ.. అంటూనే బోలెడన్ని వంకలు పెట్టారు. ఈ ఇద్దరిమధ్యా ఒక్క రొమాంటిక్ సీన్ కూడా పండలేదు. అసలు అఖిల్ ఐలవ్ యూ కూడా చెప్పలేదు.. అంటూ ఫ్యాన్స్ హర్టయ్యారు. మరీ అంత వీక్ నేరేషన్ మధ్య రొమాన్స్ తేలిపోయిందన్న విమర్శలొచ్చాయి. ఇదే విషయం గురించి సయేషా పెదవి విప్పింది. అఖిల్ తో రొమాన్స్ కంటెంట్ మరింత పెంచాల్సింది. లవ్ సీన్స్ తో పాటు ఎమోషన్ కంటెంట్ ని పెంచి ఉంటే బావుండేదనిపించింది... అంటూ తన మనసులోని మాట చెప్పింది సయేషా.
ప్రస్తుతం ఈ భామ అజయ్‌దేవగన్ సరసన శివాయ్ మూవీలో నటిస్తోంది. బాలీవుడ్ లో తన డెబ్యూ సినిమా ఇది. అజయ్ గురించి చెబుతూ.. అంత పెద్ద స్టార్ హీరో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తూ తన సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అది అతడి గొప్పతనం .. అంటూ సయేషా పొగిడేసింది. సల్మాన్ ఖాన్ చాలా కాలం క్రితమే నన్ను చూసి నువ్వు హీరోయిన్ అయితే బావుంటుందని చెప్పారు. నా హైటు - వెయిటు ఫీచర్స్ అన్నీ తనకి నచ్చాయి. అందుకే అలా అన్నారు. ఇవన్నీ ఇన్‌స్పయిర్ చేయడం వల్లనే హీరోయిన్ అయ్యానని చెప్పింది సయేషా. బాలీవుడ్ క్లాసిక్ హీరో దిలీప్ కుమార్ - క్లాసిక్ హీరోయిన్ సైరాభానుల మనవరాలిగా సయేషా బాలీవుడ్ లో పాపులర్. టాలీవుడ్ లో జస్ట్ మిస్ అయ్యింది కానీ పెద్ద హీరోయిన్ అయ్యేదే. అఖిల్ మూవీలో లోటుపాట్లేంటో సయేషా చెప్పేసింది. మరి వినాయక్ వింటున్నారా?