Begin typing your search above and press return to search.

కుతురి మొదటి ఫొటోతో స్టార్ కపుల్స్

By:  Tupaki Desk   |   14 Dec 2022 8:30 AM GMT
కుతురి మొదటి ఫొటోతో స్టార్ కపుల్స్
X
తమిళ చిత్ర పరిశ్రమలో టాలెంటెడ్ యాక్టర్ గా మంచి గుర్తింపును అందుకున్న ఆర్య కేవలం కథానాయకుడిగా గానే కాకుండా కొన్ని మంచి సపోర్టింగ్ రోల్స్ తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. తెలుగులో అతను మొదట అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక తర్వాత అనుష్క సైజ్ జీరో సినిమాలో కూడా ఒక స్పెషల్ పాత్రలో కనిపించాడు.

అయితే ఆర్య యువ హీరోయిన్ సాయేషాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ వయసులో 17 ఏళ్లు వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో సోషల్ మీడియాలో వీరి ప్రేమ గురించి అనేక రకాల కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఏడాది క్రితం వీరు ఒక పాపకు కూడా జన్మనిచ్చారు.

ఇక ఆ పాప ఫోటోలు మాత్రం మొన్నటివరకు సోషల్ మీడియాలో విడుదల చేయలేదు. ఇక మొత్తానికి ఇటీవల మొదటి పుట్టినరోజు రోజు సందర్భంగా సాయేషా వారి పాపను సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ కు పరిచయం చేశారు.

పాప పేరు అరియానా అంటూ మాదొక చక్కని చిన్న ఫ్యామిలీ అని క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సాయేషా ఎప్పుడూ కూడా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇక మొదటిసారి ఆమె తన కూతురికి సంబంధించిన ఫోటో పోస్ట్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. అరియానా కూడా చాలా క్యూట్ గా ఉంది అని ఈ చిన్న ఫ్యామిలీ చాలా అందంగా ఉంది అంటూ ఫ్యాన్ ఫాలోవర్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక ఆర్య అయితే ప్రస్తుతం తమిళంలోనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక సాయేషా పాపకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరమయింది. ప్రస్తుతం అయితే ఆమె తన ఫ్యామిలీ లైఫ్ తోనే ఎంజాయ్ చేస్తోంది. భవిష్యత్తులో సినిమాలు చేస్తుందా లేదా అనే విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.