Begin typing your search above and press return to search.

సంజయ్ కూతురిగా అఖిల్ హీరోయిన్

By:  Tupaki Desk   |   22 Nov 2016 1:30 PM GMT
సంజయ్ కూతురిగా అఖిల్ హీరోయిన్
X
ఫస్ట్ మూవీ హిట్ అవడం ఎవరికైనా ఇంపార్టెంటే. హీరోయిన్స్ కైతే కొంచెం ఎక్కువ అవసరం. లేదంటే ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా మళ్లీ వాళ్ల మొహం కూడా చూడరు. కాకపోతే ఈ విషయంలో సయేషా సైగల్ కాస్త లక్కీ అనే అనుకోవాలి. డెబ్యూ మూవీస్ నిరాశపర్చినా ఏదో ఒక ఛాన్స్ మాత్రం అందుకుంటూనే ఉంది. ఇప్పుడు సంజయ్ దత్ డాటర్ నటించే అవకాశం దక్కించుకొంది.

అఖిల్ మూవీతో తెలుగులో.. అజయ్ దేవ్ గన్ శివాయ్ తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీనే దొరికింది సయేషాకి. కానీ రెండు చోట్ల తొలి చిత్రాలు పెద్ద గుర్తింపు ఇవ్వలేదు. రిలీజ్ ముందు దిలీప్ కుమార్ మనవరాలు పరిచయమవుతుందంటూ కాస్త హడావుడి జరిగినా విడుదల తర్వాత మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బికినీ.. లిప్ లాక్స్ కి కూడా నేను రెడీనే అంటూ స్టేటిమెంట్స్ ఇచ్చింది. అయితే వాటి అవసరం లేకుండానే సయేషాని ఇప్పుడు మరో ఆఫర్ వరించింది. రెండోసారి రీఎంట్రీ ఇవ్వబోతున్న సంజయ్ దత్ కి కూతురిగా నటించే ఛాన్స్ అందుకొంది.

జైలు నుంచి రిలీజై చాలా రోజులైనా ఇన్నాళ్లూ మేకప్ వేయని సంజయ్ దత్ త్వరలో ఒమాంగ్ కుమార్ డైరెక్షన్లో భూమి అనే మూవీలో నటించబోతున్నాడు. తండ్రి కూతుళ్ల చుట్టూ తిరిగే ఈ కథలో సంజయ్ కూతురిగా సయేషా కనిపించనుంది. కూతురు కాబట్టి ఏదో చిన్న రోల్ కాదని సయేషా పాత్రకి వెయిట్ ఎక్కువని.. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుందంటున్నారు. మేరీకోమ్ తీసిన ఒమాంగ్ ఇప్పుడు సంజయ్ తో ఫాదర్- డాటర్ రిలేషన్తో మూవీ అంటే ఇందులో గ్యారంటీగా విషయముండొచ్చంటున్నారు.

అయితే హీరోయిన్ నుంచి ఇలా కూతురి రోల్ కి షిఫ్ట్ అయితే ఫ్యూచర్ ఉండదని కొంతమంది సయేషాని వార్న్ చేస్తున్నారు సినిమా జనాలు. కానీ ఇప్పుడు అవకాశం రావడమే ఎక్కువన్నట్టు అఖిల్ హీరోయిన్ పరిస్థితి. మరి ఈ ఛాన్సైనా సయేషాని నిలబెడుతుందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/