Begin typing your search above and press return to search.
బ్రేక్ ఈవెన్ దిశగా సాయి తేజ్ 'సోలో బ్రతుకే..'
By: Tupaki Desk | 28 Dec 2020 5:30 AM GMTమెగా హీరో సాయి తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు థియేట్రికల్ రిలీజ్ చేశారు. కొన్ని నెలల తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కోవిడ్ నేపథ్యంలో ప్రేక్షకులు వస్తారా అనే అనుమానాలను ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తొలగించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్లు రాబదుతోంది. ఫస్ట్ రెండు రోజులతో పోల్చుకుంటే మూడో రోజు షోలు పెంచడంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో సుమారు 4.8 కోట్ల షేర్ రాబట్టిన సాయి తేజ్ సినిమా వీకెండ్ లో వచ్చిన రెస్పాన్స్ తో బ్రేక్ ఈవెన్ దిశగా పయనిస్తోంది. నాల్గవ రోజుతో 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ ని చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. 'చిత్రాలహరి' 'ప్రతిరోజూ పండగే' వంటి వరుస హిట్స్ తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశాడు సాయి తేజ్.
కోవిడ్ లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ సూపర్ హిట్ గా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా నిలవనుంది. కరోనా సమయంలో కూడా ఈ సినిమా ఇలాంటి కలెక్షన్స్ రాబట్టడం టాలీవుడ్ కి శుభపరిణామం అని సినీ వర్గాలు అంటున్నాయి. 50 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ తో ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం గొప్ప విషయమని చెప్తున్నారు. అయితే ఈ సినిమాకి ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం కూడా ఈ విజయానికి కారణమైంది. ఏదేమైనా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫలితంతో ఇండస్ట్రీలో ఆశలు చిగురించి చిన్న, పెద్ద సినిమాలన్నింటికీ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సంక్రాంతి కి విడుదల కానున్న రవితేజ 'క్రాక్' - రామ్ 'రెడ్' - రానా 'అరణ్య' - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' చిత్రాలు మంచి కలెక్షన్స్ రాబట్టవచ్చని నమ్మకంగా ఉన్నాయి.