Begin typing your search above and press return to search.

ది బెస్ట్ అన్న ప్ర‌శంస‌తో `స్కామ్ 1992` ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫుల్ జోష్‌

By:  Tupaki Desk   |   17 Oct 2020 10:50 AM GMT
ది బెస్ట్ అన్న ప్ర‌శంస‌తో `స్కామ్ 1992` ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫుల్ జోష్‌
X
థియేట‌ర్లు మూత‌ప‌డినా డిజిట‌ల్ వెబ్ సిరీస్ ల‌తో కాల‌క్షేపాన్ని గొప్ప‌గా ఆస్వాధించారు ఆడియెన్. తొలిగా ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ స‌క్సెస్ ఈ వేదిక‌పై ఆస‌క్తిని పెంచింది. ఓటీటీల్లో గొప్ప క్వాలిటీ వినోదం అందించ‌వ‌చ్చ‌ని బాలీవుడ్ లో స్థిర‌ప‌డిన మ‌న తెలుగు ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే నిరూపించారు. ఆ త‌ర్వాత స్పెష‌ల్ ఓపీఎస్ అంతే ఘ‌న‌విజ‌యం సాధించింది. ఇండియ‌న్ గూఢ‌చారి వ్య‌వ‌స్థ రా కార్య‌క‌లాపాల‌పై ర‌క్తి క‌ట్టించే విధంగా తీవ్ర‌వాదం నేప‌థ్యంలో సిరీస్ రంజింప‌జేసింది.

ఇక డిజిట‌ల్లో రిలీజైన వాటిలో కొన్ని సినిమాలు సిరీస్ లు గొప్ప‌గానే మెప్పించాయి. సేక్రెడ్ గేమ్స్.. మీర్జా పూర్.. పాతాళ్ లోక్ .. ఇవ‌న్నీ ఇటీవ‌లే వ‌చ్చి ఆడియెన్ మెప్పు పొందాయి. ఓటీటీల్లో ప‌లు క్రైమ్ థ్రిల్ల‌ర్లు కూడా మెప్పించాయి. ఇక ఎలాంటి అంచ‌నా లేకుండా వ‌చ్చింది స్కామ్ 1992. జ‌మానా కాలంలో స్టాక్ మార్కెట్లో 5000 కోట్ల స్కామ్ కి సంబంధించిన హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణంపై తీసిన ఈ వెబ్ సిరీస్ హోరెత్తుతోంది. జాతీయ అవార్డు గ్రహీత ఫిల్మ్ డైరెక్టర్ హన్సాల్ మెహతా త‌న స్థాయికి త‌గ్గ విధంగా సిరీస్ ని రూపొందించార‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్రతీక్ గాంధీ ఇందులో హర్షద్ మెహతా పాత్రను పోషించాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన వాటిలో ఇదే ది బెస్ట్ సిరీస్ అని చెబుతున్నారు. సోనీ లైవ్ లో అదిరిపోయే ఆద‌ర‌ణ ద‌క్కుతోంద‌ట‌. ఈ సిరీస్ స్క్రిప్టుతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లలో పాఠాలు చెప్పాలని కాంప్లిమెంట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఈ సిరీస్ విజ‌యంపై ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ-``స్కామ్ 1992 విజయంతో నేను ఆనందంలో మునిగి తేలుతున్నా. మూడేళ్ల పరిశోధన.. 550 పేజీల స్క్రిప్ట్‌కు ప్రాణం పోసాం. స్కామ్ 1992 విజ‌య కార‌కులు రాజీప‌డ‌ని నా నిర్మాతలకు చాలా రుణపడ్డాను. సిరీస్ లోని సంక్లిష్టమైన ఆర్థిక విషయాలను సరళీకృతం చేయడానికి నా నిర్మాత‌లు ఉత్తమంగా ప్రయత్నించారు. స‌బ్జెక్ట్ క‌ఠిన‌మైన‌దే అయినా ప్రధాన స్రవంతి వాణిజ్య సూత్రాన్ని నేను ఎప్పుడూ చెప్పడానికి ప్రయత్నించాను. తారాగణం స‌రిగా చేయ‌క‌పోయినా ఈ రోజు ఈ రకమైన ఫ‌లితం వ‌చ్చేది కాదు`` అని తెలిపారు.