Begin typing your search above and press return to search.
చిక్కుల్లో మాధవన్..ఫైరవుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు!
By: Tupaki Desk | 25 Aug 2022 7:41 AM GMTమాధవన్ నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ బయోపిక్ 'రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్'. ఇస్రో సైంటిస్ట్ నంబినారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. షారుఖ్ ఖాన్, సూర్య కీలక అతిథి పాత్రలలో నటించగా సిమ్రాన్, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. మాధవన్ కీలక పాత్రలో నటించడమే కాకుండా ఈ మూవీకి కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతలలో ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
జూలై 1న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మాధవన్ కు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే టాక్ బాగున్నా ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. దీంతో ఈ మూవీని చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలో విడువల చేశారు. చేయని తప్పుకు దేశ ద్రోహం కేసుకింద అరెస్టై విమర్శలు ఎదుర్కొన్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులతో పాటు విమర్శకులని సైతం మెప్పించింది.
అయితే ఈ మూవీపై ఇస్త్రో శాస్త్రవేత్తలు మండిపడుతున్నారట. డా. ఏ.ఈ. ముత్తునాయగం, డైరెక్టర్, ఎల్పీఈ, ఇస్త్రో, క్రియోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈవీఎస్ నంబూతిరి, క్రియోజెనిక్ ఇంజిన్ డిప్యూటీ డైరెక్టర్ డి. శశికుమారన్, ఇస్రోకు చెంతిన ఇతర మాజీ శాస్త్ర వేత్తలు మీడియా ముందు తాజాగా కీలక విషయాల్ని వెల్లడించారు. 'రాకెట్రీ :ది నంబి ఎఫెక్ట్' సినిమాతో పాటు పలు టీవీ ఛానెళ్లలో నంబి నారాయణన్ ఇస్రోతో పాటు ఇతర శాస్త్రవేత్తల పరువు తీశారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలకు కొన్ని కీలక విషయాలని వెల్లడించడానికి మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు. ఇస్రోలో చాలా ప్రాజెక్ట్ లకు తాను పితామముడినని నంబి నారాయణన్ చేస్తున్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అబ్దుల్ కలాంను ఆయన ఒకసారి సరిదిద్దినట్టుగా సినిమాలో చూపించారని అది పచ్చి అబద్ధమని కొట్టి పారేశారు.
ఈ సినిమాలో చూపించిన తప్పుడు సమాచాంపై చర్యలు తీసుకోవాలని ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ ను కోరినట్టుగా వెలిపారు. నారాయణన్ ని అరెస్ట్ చేయడం వల్ల భారత్ క్రయోజెనిక్ టెక్నాలజీని కొనుగోలు చేయడం విషయంలో జాప్యం జరిగిందని సినిమాలో చూపించారు అది కూడా అసత్యమేనని శాస్త్రవేత్తలు తేల్చడం గమనార్హం.
1980లో క్రియోజెనిక్ టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేయడం ప్రారంభించిందని తెలిపారు. అప్పుడు నంబూతిరి ఇన్ చార్జ్ గా వున్నారని గుర్తు చేశారు. నారాయణన్ కి ఈ ప్రాజెక్ట్ తో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇస్రోకు సంబంధించిన సినిమాలో చూపించిన 90 శాతం అవాస్తవాలేనని మాజీ శాస్త్రవేత్తలు 'రాకెట్రీ' పై మండిపడుతున్నారు. దీంతో మాధవన్ చిక్కుల్లో పడినట్టేనని తెలుస్తోంది. మరి దీనిపై మాధవన్ ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.