Begin typing your search above and press return to search.
బాహుబలి ఖాతాలో మరో గ్రేట్ రికార్డ్
By: Tupaki Desk | 7 Sep 2016 7:30 AM GMTహాలీవుడ్ కాకుండా గొప్ప సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఏ ఇరాన్.. ఇరాకో.. లేకపోతే ఫ్రెంచ్.. కొరియన్ మూవీస్ మాత్రమే కనిపిస్తాయ్. ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ కురిపించినా.. మన భారతీయ సినిమాలు మాత్రం వాటి దరిదాపుల్లో కూడా లేవు. అయితే ఇప్పుడు బాహుబలి ఆ లోటు తీర్చేసింది. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన ఈ ఎపిక్ మాస్టర్ పీస్ 15 ఫారిన్ బ్లాక్ బస్టర్స్‌లో.. స్థానం సంపాదించగా.. బాహుబలి యూనిట్ కి హాలీవుడ్ విషెస్ చెప్పింది. (వాళ్లకి మనం ఫారిన్ కంట్రీనే కదా)
కథ.. కథనం.. స్టార్ కాస్టింగ్.. థ్రిల్లర్ ని తలపించే యుద్ధ సన్నివేశాలు.. అద్భుతమైన సంగీతం.. ఒకటేంటి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాహుబలి- ద బిగినింగ్ కన్ను తిప్పుకోనీయదని.. లార్జర్ కాన్వాస్ తో రాజమౌళి సృష్టించిన అద్భుతమైన కళాఖండమంటూ బాహుబలిపై స్క్రీన్ రాంట్ అనే ఇంటర్నేషనల్ మీడియా హౌజ్ పొగడ్తల వర్షం కురిపించింది. ఇక లెజండరీ జపనీస్ ఫిల్మ్ మేకర్ అకీరా కురోసవా తీసిన రాన్ మూవీ ఈ లిస్ట్ టాప్ ప్లేస్ లో ఉంది.
ప్రతిష్టాత్మక సంస్థ నుంచి కాంప్లిమెంట్స్ రావడంతో బాహుబలి మేకర్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకొన్నారు.