Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ సినిమా ప్రదర్శనను కోర్టు ఆపేసింది
By: Tupaki Desk | 24 Dec 2017 8:09 AM GMTపవర్ స్టార్ అంటే మన పవన్ కళ్యాణ్ కాదులెండి. కన్నడ నాట కూడా ఓ పవర్ స్టార్ ఉన్నాడు. అతనే.. పునీత్ రాజ్ కుమార్. అతను కథానాయకుడిగా నటించిన ‘అంజనీపుత్ర’ సినిమా ఈ వారాంతంలోనే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ఐతే అనూహ్యంగా ఈ చిత్ర ప్రదర్శనను ఆపేయాలంటూ బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ రోజు నుంచి చిత్ర ప్రదర్శన ఆగిపోతోంది.
‘అంజనీపుత్ర’ సినిమాలో న్యాయవాదుల్ని కించపరిచే సన్నివేశాలున్నాయని.. వాటి వల్ల తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని ఒక న్యాయవాది కోర్టుకెక్కాడు. ఐతే కోర్టు సినిమా ప్రదర్శనను వచ్చే నెల 2 వరకు ఆపేయాలని తీర్పు ఇవ్వడంతో చిత్ర బృందం షాక్ తింది. ఆ సన్నివేశాలు తొలగించాలనో.. న్యాయవాదులకు క్షమాపణ చెప్పాలనో కోర్టు చెబుతుందని అంతా అనుకున్నారు.
కానీ సినిమా ప్రదర్శననే ఆపేయాలని తీర్పు ఇచ్చింది కోర్టు. దీనిపై చిత్ర బృందం హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. కింది కోర్టు తీర్పుపై హైకోర్టు నుంచి త్వరగా స్టే తీసుకురాకపోతే సినిమాకు భారీ నష్టం వాటిల్లుతుంది. అభ్యంతరాలు వచ్చిన సన్నివేశాల్ని తొలగించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ‘అంజనీపుత్ర’ పైరసీ వెర్షన్ ఇప్పటికే ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఫేస్ బుక్ లో సైతం పైరసీ ప్రింట్ హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శన ఆగిపోతే.. డ్యామేజ్ మామూలుగా ఉండదు.