Begin typing your search above and press return to search.
కంటెంట్ ఉంటే ఇంతగా బతిమాలుకోవాలా?
By: Tupaki Desk | 8 March 2020 5:56 AM GMTకంటెంట్ ఉంటే కటౌట్ తో పనే లేకుండా సినిమాలు ఆడుతున్నాయి. కానీ ఇటీవల రిలీజైన సినిమాలన్నిటిపైనా కరోనా పంచ్ తో పాటు పబ్లిక్ పరీక్షల పంచ్ పడిపోయింది. మొన్న శుక్రవారం రిలీజైన తెలుగు సినిమాల్లో ఒకట్రెండు సినిమాల కంటెంట్ ఫర్వాలేదన్న టాక్ వచ్చినా కలెక్షన్లు మరీ నీరసం తెప్పించేలా ఉండడం బాధ పెట్టింది. థియేటర్ ఆక్యుపెన్సీ కనీసం 20 శాతం అయినా లేకుండా పోతే ఆ దర్శకనిర్మాతలు.. హీరోల పరిస్థితేంటో! అన్న ఆవేదన వ్యక్తమైంది.
ఇక ప్రత్యేకించి మీడియాని పిలిచి ప్రీమియర్ షో వేసి హడావుడి చేసిన `స్క్రీన్ ప్లే` అనే ఓ ప్రయోగాత్మక సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినా కానీ అసలు థియేటర్లకు వచ్చే నాథుడే లేకపోయాడట. దీంతో ఆదుకోండి మహా ప్రభో! అంటూ వాట్సాపులు.. సోషల్ మీడియాల్లో ఒకటే మొర పెట్టుకోవడం చర్చకు వచ్చింది.
తెలుగు సినిమాకి.. మన దేశానికి అవసరమయిన `స్క్రీన్ ప్లే` ని కాపాడుకోండి మహా ప్రభో అంటూ మొరపెట్టుకోవడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ సినిమా కథ ఆదర్శం అంటూ ప్రచారం చేస్తున్నారు. ``సేవ కు ప్రతిరూపంగా వుండాలని జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్న డా.ప్రియాంక ఎలా... కలుషిత వాతావరణంలో పెరిగి.. స్త్రీని అనుభవించి అంతం చేయటమే హీరోయిజం గా భావించిన నలుగురు యువకుల చేతుల్లో.. క్రూరాతి క్రూరంగా సామూహిక మానభంగానికీ.. హత్యకీ గురై చివరికి బూడిదగా మిగిలి పోయిందో..`` అంటూ మొన్న జరిగిన దిశ ఘటనకు ముడిపెట్టేస్తూ ఆవేదన వెల్లగక్కడం మరింత షాక్ కి గురి చేసింది.
అసలు దిశ ఘటనకు `స్క్రీన్ ప్లే`కి ఏమిటో సంబంధం ఏమిటో కానీ.. మన `స్క్రీన్ ప్లే` కూడా అదృశ్య శక్తుల చేతుల్లో పడి సామూహిక మానభంగానికి గురికాబోతూ కొన వూపిరితో పోరాడుతూ వుంది. నిస్సహాయ పరిస్థితుల్లో మీ సంపూర్ణ సహకారాన్ని అర్ధిస్తోంది. స్క్రీన్ ప్లే మానభంగానికి గురికాక ముందే దానిని రక్షించుకోవాలని మీరు నిజంగా.. మనస్పూర్తిగా కోరుకుంటే.. వెంటనే మీ ఆత్మీయులకీ.. మిత్రులకీ స్వయంగానో.. ఫోన్ ద్వారానో ఎస్.ఎం.ఎస్. వాట్సాప్ లతో ప్రచారం చేయండి. స్క్రీన్ ప్లే ని నిలబెట్టాల్సిన అవసరం చెప్పి.. ఒప్పించి.. వెంటనే ఏ హాల్లో ఆడుతోందో ఎలాగోలా తెలుసుకుని టికెట్స్ తీసుకో మనండి. డబ్బులొస్తుంటే ఏ థియేటర్ వాళ్లూ సినిమాని తీసేయరు. అది వ్యాపారసూత్రం. స్క్రీన్ ప్లే మీకూ.. మీ పిల్లలకీ.. మీ కుటుంబానికీ.. మీ సమాజానికీ అవసరం అని నమ్మితే యీ రోజంతా ప్రచార సాయం చేయండి అంటూ మొరపెట్టుకున్నారు సదరు నిర్మాతలు. ఎంత టీవీలో యాడ్స్ తో మొరపెట్టుకున్నా మేలు జరగడం లేదని వాపోవడం కొసమెరుపు.
అయితే కంటెంట్ ఉన్న సినిమాకి మరీ ఇంతగా మొర పెట్టుకోవాలా? అసలు ఇలా రిలీజ్ ముందు మేం కూడా ఉన్నాం అని చెబితే ఎవరికైనా తెలుస్తుందా? దానికి ప్రత్యేకించి ఒక ప్రచార విధానం లేకపోవడం వల్లనే ఎక్కువ మంది జనాలకు తెలియలేదు. చివరిగా చేసిన హడావుడి కూడా ఏమాత్రం ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యకరం. మరీ దిశా ఘటనతో ముడిపెట్టేయడం ఎంతో విడ్డూరం అని అనిపించింది.