Begin typing your search above and press return to search.

చిరు కోసం బెంగాల్‌ ను కేరళగా మార్చారా?

By:  Tupaki Desk   |   5 April 2021 12:30 PM GMT
చిరు కోసం బెంగాల్‌ ను కేరళగా మార్చారా?
X
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ రెండు రీమేక్‌ చిత్రాలు వెయిట్ చేస్తున్నాయి. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ మరియు తమిళ సూపర్‌ హిట్‌ మూవీ వేదాళం ను చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. లూసీఫర్‌ కు తమిళ దర్శకుడు మోహన్‌ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక వేదాళం రీమేక్‌ కు మన మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా దాదాపుగా ఒకే సమయంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వేదాళం సినిమా షూటింగ్‌ ఇప్పటికే చిరంజీవి లేకుండా ప్రారంభం అయ్యిందట.

ఇక వేదాళం రీమేక్ గురించి ఇండస్ట్రీ వర్గాల నుండి ఇంట్రెస్టింగ్‌ విషయం ఒకటి వినిపిస్తుంది. వేదాళం సినిమా కోల్‌ కత్తా బ్యాక్ డ్రాప్‌ లో కొనసాగుతుంది. సోదరితో కలిసి కోల్‌ కత్తా వెళ్లిన హీరోకు అక్కడి రౌడీ గ్యాంగ్‌ కుమద్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో వేదాళం రూపొందింది. కాని చిరంజీవి చేయబోతున్న వేదాళంలో మాత్రం కోల్‌ కత్తా కాకుండా కేరళను బ్యాక్‌ డ్రాప్‌ గా తీసుకున్నారు. కరోనా కారణంగానో లేదా మరేంటో కాని కథ మొత్తంను కోల్‌ కత్తా నుండి కేరళకు మార్చేశారు. సినిమా లో అందుకు తగ్గట్లుగా స్వల్పంగా మార్పులు చేర్పులు కూడా చేసినట్లుగా చెబుతున్నారు. సినిమాలో ఎంతో కీలకమైన హీరో సోదరి పాత్ర విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. వేదాళం సినిమా చిరంజీవి మాస్‌ ఇమేజ్ కు సరిగ్గా సూట్‌ అయ్యేలా ఉంటుందని దానికి తగ్గట్లుగా స్పల్ప మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

చిరంజీవి ఆచార్య సినిమా ను వచ్చే నెలలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ నెలలోనే ఆచార్య కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు లూసీఫర్‌ సినిమా రీమేక్‌ పనులను కూడా మోహన రాజా మొదలు పెట్టాడని సమాచారం అందుతోంది. లూసీఫర్‌ మరియు వేదాళం సినిమాలు పక్కా కమర్షియల్‌ గా మార్చి రూపొందించడంలో భాగంగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆచార్య తో పాటు ఆ రెండు రీమేక్‌ లు కూడా ఇదే ఏడాదిలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న చిరంజీవికి ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం జరుగుతూ వచ్చింది. కాని ఇక ముందు ఎక్కువ గ్యాప్‌ లేకుండా చూసుకోవాలని మెగా స్టార్‌ భావిస్తున్నాడు. ఈ విషయం అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.