Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: టాలీవుడ్‌ లో స్క్రిప్టు డాక్ల‌ర్లు

By:  Tupaki Desk   |   28 July 2018 2:30 AM GMT
టాప్ స్టోరి: టాలీవుడ్‌ లో స్క్రిప్టు డాక్ల‌ర్లు
X
ప్ర‌తియేటా 150 -200 సినిమాలు తెర‌కెక్కుతాయి టాలీవుడ్‌ లో. ఇన్ని సినిమాలు తెర‌కెక్కుతున్నాయంటే అన్ని క‌థ‌లు రెడీ అవుతున్నాయ‌నే అర్థం. ఇక క‌థ రాసుకుని - సీన్లు అల్లుకుని - స్క్రీన్‌ ప్లే వ‌గైరా పూర్త‌య్యే క్ర‌మంలో జ‌రిగే తంతును స్క్రిప్టు వ‌ర్క్‌ గా చెబుతుంటారు. ఈ ప్రాసెస్‌ లో అనుభ‌వం లేని వాళ్లు చేసే తేడా ప‌నులు ఒక్కోసారి నిర్మాత‌లు భారీగా మూల్యం చెల్లించుకోవ‌డానికి కార‌ణ‌మ‌వుతుంటాయి. కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ల‌తో తెర‌కెక్కించే సినిమాల్లో స్క్రిప్టు ప‌రంగా లాజిక్ వెతక‌డం ఎంతో ఇంపార్టెంట్‌. ఇలాంటి లాజిక్కులు - జిమ్మిక్కులు వెత‌కాలంటే అందుకు కావాల్సిన వాళ్లే స్క్రిప్టు డాక్ట‌ర్లు.

ఈ ప‌దం కొత్తేమీ కాదు - ప‌లు సంద‌ర్భాల్లో వినిపించినా అంత‌గా పాపుల‌ర‌వ్వ‌లేదంతే. స్క్రిప్టు డాక్ట‌ర్లు అంటే ప్ర‌త్యేకించి ఎక్క‌డినుంచో పుట్టుకు రారు. ఇప్పుడున్న సీనియ‌ర్ రైట‌ర్లు స్క్రిప్టు డాక్ట‌ర్లు. వీళ్లు వంద‌ల సినిమాల‌కు రాసి రాసి చివ‌రికి డాక్ట‌ర్లుగా మార‌తారు. డాక్ట‌రేట్ ప‌ట్టా లేక‌పోయినా అనుభ‌వంతో కొన్ని విలువైన స‌జెష‌న్స్ యంగ‌ర్ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు అందిస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్ల‌ను వేలు పెట్ట‌నీకుండా చేశాడు కాబ‌ట్టే త్రివిక్ర‌మ్ లాంటివాళ్లు స‌ప‌రేట్‌గా ఉంటారు. ఇక‌పోతే ఇప్పుడున్న వాళ్ల‌లో ప్ర‌ముఖంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ - ప‌రుచూరి గోపాల కృష్ణ‌ - సీనియ‌ర్ రైట‌ర్‌ స‌త్యానంద్‌ - పోసాని - సాయిమాధ‌వ్ వంటి వాళ్లు స్క్రిప్టు డాక్ట‌ర్లుగా ఉంటారు. క‌థార‌చ‌న‌ - స్క్రీన్‌ ప్లే - డైలాగులు వ‌గైరా అన్ని విభాగాల్లోనూ వీళ్ల‌ది అందెవేసిన చేయి. అందువ‌ల్ల క్రేజీగా - భారీగా తెర‌కెక్కే సినిమాల‌కు వీళ్ల నుంచి స‌జెష‌న్స్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటున్నాయి. అలాగ‌ని అన్ని సినిమాల‌కు వీళ్లు ప‌ని చేయాల‌ని రూలేం లేదు. పిలిచిన వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌మ అమూల్య‌మైన స‌ల‌హాలిస్తుంటారు. గ్రూప్ డిస్క‌ష‌న్ల‌లో పాల్గొని విలువైన సూచ‌న‌లు - స‌ల‌హాలు ఇస్తుంటారు. స్వ‌యంగా కొన్నిటిని రాసిస్తుంటారు. ఇక ఇందులో ర‌చ‌యిత‌ల‌తో పాటుగా - కె.రాఘ‌వేంద్ర‌రావు స్థాయి ద‌ర్శ‌కులు స్క్రిప్టు డాక్ట‌ర్లుగా స‌ల‌హాలిచ్చే స‌న్నివేశం ఉంటుందిట‌. స్క్రిప్టు డాక్ట‌ర్లు అంటే ఓ గౌర‌వం. వీళ్ల రేంజు ఎంత అంటే వాళ్లు చేసే ప‌ని హైలెవ‌ల్‌ లో ఉంటుంద‌ని ఓ అప్‌కం రైట‌ర్ చెప్పాడు. ఎవ‌రైనా స్క్రిప్టు రాస్తే వీళ్ల‌లో ఎవ‌రో ఒక‌రిద‌గ్గ‌రికి వెళ్లి ఓకే చేయించుకోవాలి. అప్రూవ‌ల్ తెచ్చుకుంటే స‌జెష‌న్స్ ఉంటాయి. వెళ్ల‌ని వాళ్ల క‌థ వేరు. అయితే ఒక్కోసారి ఏ అనుభ‌వం లేనివాళ్లు తీసే సినిమాలు బ్లాక్‌ బ‌స్ట‌ర్లు కొడుతుంటాయి. కొన్నిసార్లు ప్రామాణిక‌త ఉండ‌దు. మ‌రికొన్ని సార్లు ప్రామాణిక‌త‌ను లెక్కించాల్సిన స‌న్నివేశం ఉంటుంది. కొత్త వాళ్ల‌లో చాలామంది సొంతంగా ఏం రాసుకుంటే అదే స్క్రిప్టు అనుకుని ఆన‌క బొక్క బోర్లా ప‌డుతుంటార‌ని - అనుభ‌వ పూర్వ‌కంగా ఓ రైట‌ర్ చెప్పుకొచ్చాడు.