Begin typing your search above and press return to search.

SDT15 స్పెషల్ పోస్టర్: మిస్టరీని ఛేదించడానికి సిద్ధమైన సుప్రీమ్ హీరో..!

By:  Tupaki Desk   |   15 Oct 2022 11:48 AM IST
SDT15 స్పెషల్ పోస్టర్: మిస్టరీని ఛేదించడానికి సిద్ధమైన సుప్రీమ్ హీరో..!
X
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇదొక ఆసక్తికరమైన మిస్టిక్ థ్రిల్లర్. తేజ్ కెరీర్ లో పదిహేనవ చిత్రం. తాత్కాలికంగా #SDT15 అని పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నేడు (అక్టోబర్ 15) సాయి తేజ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ #SDT15 మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో తేజ్ తన చేతిలో ఒక కాగడా పట్టుకొని నిలబడి ఉండగా.. అతని ఎదురుగా అనేకమంది గుమిగూడి ఉన్నారు.

సాయి తేజ్ ఫేస్ కనిపించకుండా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది కచ్చితంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే సినిమా అని హామీ ఇస్తోంది. స్నీక్ పీక్ వీడియోతో త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు 2023 సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.

కెరీర్ ప్రారంభం నుంచీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు సాయి తేజ్. ఇప్పుడు తొలిసారిగా ఒక మిస్టిక్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. SDT15 సినిమాలో 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకోవడమే కాదు.. స్టోరీ - స్క్రీన్ ప్లేలో తన సహకారం అందిస్తున్నారు.

'విక్రాంత్ రోణా' 'కాంతారా' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు వర్క్ చేసిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. శ్యామ్దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. SDT15 చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో ప్రకటించబడతాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.