Begin typing your search above and press return to search.
రావిపూడి సెకండ్ హాఫ్ గండం తప్పించుకుంటాడా?
By: Tupaki Desk | 30 Dec 2019 2:30 PM GMTఈ సంక్రాంతికి విడుదల కానున్న భారీ సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' ఒకటి. ఈ సినిమాకు మంచి ఫామ్ లో ఉన్న అనిల్ రావిపూడి దర్శకుడు. అనిల్ రావిపూడి వరసగా హిట్లు నమోదు చేస్తూ హాట్ షాట్ డైరెక్టర్ గా ఎదిగినప్పటికీ ఒక విషయంలో మాత్రం వీక్ అనే విమర్శలు ఉన్నాయి. అదేంటంటే అనిల్ సెకండ్ హాఫ్ విషయంలో తడబడతాడు. అనిల్ గత చిత్రాలు చూసినవారు వ్యక్తం చేసిన అభిప్రాయమిది.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఇంటెన్సిటీ తగ్గడమో.. లేదా స్లో అనిపించడమో.. వీక్ అనిపించడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో సూపర్ హిట్ గా నిలిచిన 'F2' లో కూడా సెకండ్ హాఫ్ వీక్ అనే అభిప్రాయం అటు రివ్యూయర్లు.. ఇటు క్రిటిక్స్ కూడా వ్యక్తం చేశారు. అయితే పోటీలో ఉన్న ఇతర సినిమాలు తుస్సుమనిపించడం.. ఈ సినిమాలో వెంకీ ఫ్యాక్టర్ వర్క్ అవుట్ కావడంతో ఆ వీక్నెస్ ను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఈ సినిమానే కాదు.. గత సినిమాల్లో కూడా అనిల్ రావిపూడిపై ఇదే కంప్లయింట్ ఉంది. ఈ విషయం 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ సభ్యుల మధ్య కూడా చర్చకు వచ్చిందని.. సెకండ్ హాఫ్ ను ట్రిమ్ చేద్దామని మొదట అలోచించారని సమాచారం. అయితే అలాంటి ట్రిమ్మింగ్ లేకుండానే 'సరిలేరు నీకెవ్వరు' ఫైనల్ రన్ టైమ్ లాక్ చేశారట.
'సరిలేరు నీకెవ్వరు' భారీ పోటీ మధ్య రిలీజ్ అవుతోంది కాబట్టి ఏమాత్రం వీక్ పాయింట్ ఉన్నా అది బాక్స్ ఆఫీస్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ విషయంలో అనిల్ కు ఎప్పుడూ నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటాడు. అందులో ఎవరికీ అనుమానాలు లేవు. మరి ఈ సెకండ్ హాఫ్ గండాన్ని అనిల్ దాటగలడా? మహేష్ బాబు సినిమాకు సెకండ్ హాఫ్ ను ఎలా మ్యానేజ్ చేశాడో తెలియాలంటే మాత్రం మనం సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు.