Begin typing your search above and press return to search.

స‌ర్కార్ వారి పాట‌కు సెకండ్ వేవ్ బ్రేక్!

By:  Tupaki Desk   |   18 April 2021 6:34 AM GMT
స‌ర్కార్ వారి పాట‌కు సెకండ్ వేవ్ బ్రేక్!
X
కోవిడ్ 19తో స‌హ‌జీవ‌నం చేయాల‌ని దేశంలో అంద‌రు ముఖ్య‌మంత్రుల కంటే ముందే ఊహించారు ఏపీ స‌ర్కార్ వారు జ‌గ‌న్. తొలిగా ఏమాత్రం త‌డుముకోకుండా ముందే ప్ర‌క‌టించింది సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే. కోవిడ్ తో స‌హ‌జీవ‌నం చేస్తూ ప్ర‌జ‌లు ముందుకు వెళ్లాల్సిందేన‌ని ఆనాడే ఆయ‌న ఊహించి అన్నారో ఏమో కానీ.. ఆయ‌న అన్న‌దే జ‌రుగుతోంది. లోకం దానికి నెమ్మ‌దిగా అల‌వాటు ప‌డిపోతోంది.

ఇప్పుడు కొంద‌రు స్టార్ హీరోలు కూడా దానికి అల‌వాటు ప‌డిపోయి షూటింగుల్ని కొన‌సాగించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓవైపు సెకండ్ వేవ్ ప్ర‌భావంతో స్టార్ల‌కు కోవిడ్ సోకుతోంది. అయినా చాలా మంది భ‌య‌ప‌డ‌కుండా షూటింగులు చేస్తున్నారు. కానీ ప‌రిస్థితి అదుపుత‌ప్పి సెట్స్ లో ఎవ‌రికైనా క‌రోనా సోకితే షూటింగుల‌కు బ్రేక్ ప‌డుతోంది.

ఇటీవ‌లే స‌ర్కార్ వారి పాట చిత్ర‌బృందంలో కొంద‌రికి కోవిడ్ సోకింది. దాంతో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. కానీ ఇంత‌లోనే `సర్కారు వారి పాట` చిత్రీకరణను తిరిగి ప్రారంభించే ఆలోచ‌న‌తో ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి పరిస్థితులు అనుకూలంగా లేనందున‌ సినిమా షూటింగ్ వాయిదా వేయాలని మహేష్ మేకర్స్ ను కోర‌డం వ‌ల్లే ఆచితూచి అడుగులేస్తున్నారట‌. ప్ర‌స్తుతానికి మొత్తం మూవీ యూనిట్ అంద‌రికీ కరోనావైరస్ పరీక్షలను చేయిస్తున్నారు. ప‌రిస్థితి కొంత అనుకూలంగా మారినా తిరిగి ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఏపీ స‌ర్కార్ చెప్పిన‌దే ఇక టాలీవుడ్ అనుస‌రించాల్సి ఉంటుంద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది.

పరశురాం దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ -14 రీల్స్ ప్లస్ -జీఎంబీ ఎంటర్ టైన్మెంట్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి 2022 విడుదల కానుంది.