Begin typing your search above and press return to search.
#సెకండ్ వేవ్.. సాయంలో మన స్టార్లు గ్రేట్
By: Tupaki Desk | 23 May 2021 5:30 AM GMTదేశంలో తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కేసుల సంఖ్య నెమ్మదిస్తున్నా మరణాలు భయపెడుతున్నాయి. ఈ క్లిష్టమైన సమయాల్లో సెలబ్రిటీలు తమ వంతు సాయానికి ముందుకొస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సీసీసీ ద్వారా సాయం చేస్తూనే ఆర్టిస్టులకు కోవిడ్ భారిన పడి మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు విరివిగా ఆర్థిక విరాళాల్ని అందజేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ అసాధారణ యజ్ఞం గురించి తెలిసిందే.
ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్.. షామా శికందర్ సహా పలువురు కథానాయికలు నిధి సేకరణ కార్యక్రమాల్ని చేపట్టి ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నటి హోస్ట్ నిర్మాత రేణు దేశాయ్ నిరుపేదల సాయం కోసం ముందుకొచ్చారు. వారిని రక్షించడానికి తనవంతు సాయం చేస్తున్నారు. రోగి- ఆసుపత్రి- నగరం వివరాలను పొందిన తరువాత రేణు దేశాయ్ వారికి సహాయం చేస్తున్నారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో బెంగళూరు- చెన్నైతో పాటు హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ పట్టణాల నుండి అభ్యర్థనలు స్వీకరిస్తున్నారు. రేణు రోగుల వివరాలు వారి అవసరాలను షార్ట్ లిస్ట్ చేసి దాని ఆధారంగా ఆమె సంబంధిత స్వచ్ఛంద సంస్థలకు తెలియజేస్తున్నారు. పేదలు- స్వచ్ఛంద సంస్థల మధ్య వారధిగా రేణు వ్యవహరిస్తున్నారు. రోగులు ఆక్సిజన్ సరఫరా- పడకలు.. కోవిడ్ -19 రోగులకు ఆహారం అందిస్తూ.. సకాలంలో మందులను అందించేలా రేణు ఎన్జీఓలతో చురుకుగా పనిచేస్తున్నారు.
మరోవైపు లక్ష్మి మంచు డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఇంట్లో వండిన ఆహారాన్ని అందిస్తున్నారు. తన కుక్ సహాయంతో లక్ష్మి రోజూ 50 మందికి పైగా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వేసవిలో తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆహారాన్ని పంపుతున్నారు. గత వారం రోజులుగా లక్ష్మి ఈ సేవ చేస్తున్నారని తెలిసింది.
దర్శకుడు ఎన్.శంకర్ తమ సంఘంలోని మెంబర్ల సంక్షేమం కోసం తనవంతుగా సంఘం తరపున సాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు ప్రచారార్భాటం లేకుండా పేదలకు నిత్యావసరాల సాయానికి ముందుకొస్తున్నారు. పలువురు స్టార్ హీరోలు డొనేషన్లు ఇచ్చారు. ఈవెంట్స్ షోలు సినిమాల ద్వారా జీవనం సాగించే డ్యాన్సర్లకు కిరాణా సామాగ్రిని సరఫరా చేయడానికి డాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ అతని భార్య జ్యోతిరాజ్ ముందుకు వచ్చారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ విషయంలో సందీప్ - అతని భార్యకు మద్దతుగా నిలుస్తున్నారు.