Begin typing your search above and press return to search.
శింబుతో పెళ్లికి హన్సిక ఎందుకు ఒప్పుకోలేదు?
By: Tupaki Desk | 20 Sep 2017 7:23 AM GMTకోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబు ముందుగా నయనతారతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. రెండు మూడేళ్ల పాటు వీళ్లిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. కానీ తర్వాత నయన్ అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఐతే కొంత కాలానికే శింబుకు హన్సికతో జోడీ కుదిరింది. వీళ్లిద్దరూ పెళ్లికి కూడా రెడీ అయిపోయినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం కొనసాగలేదు. హన్సిక కూడా అతణ్ని వదిలేసి వెళ్లిపోయింది.
శింబు-నయన్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. అసలు నయన్ యాటిట్యూడ్ ప్రకారం చూస్తే.. ఆమె శింబుతో ఎఫైర్ మొదలుపెట్టడం.. ఆ తర్వాత తనకు దూరం కావడం ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. కానీ శింబుతో హన్సిక ప్రేమాయణం మొదలుపెట్టడం ఎంత ఆశ్చర్యమో.. చాలా తర్వగా అతడికి దూరం కావడమూ ఆశ్చర్యమే. వీళ్లిద్దరికీ ఎక్కడ తేడా కొట్టిందన్నదే అర్థం కాలేదు.
ఈ విషయంపై శింబు తండ్రి టి.రాజేందర్ క్లారిటీ ఇచ్చాడు. శింబు కొత్త సినిమా ‘సరసుడు’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన రాజేందర్.. ఓ ఇంటర్వ్యూలో శింబు-హన్సిక బ్రేకప్ గురించి ఓపెనయ్యాడు. శింబు పెట్టిన కండిషన్ హన్సికకు నచ్చకపోవడం వల్లే ఆమె అతణ్ని వదిలేసి వెళ్లిపోయిందని రాజేందర్ తెలిపాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లికి కూడా రెడీ అయిన సమయంలో.. తన తల్లి అభీష్టాన్ని హన్సికకు చెప్పాడన్నాడు.
పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగడం తన తల్లి ఉషకు ఇష్టం లేదని.. సినిమాలు మానేయాల్సి ఉంటుందని శింబు చెప్పాడని.. ఆ మాట నచ్చకే హన్సిక అతడికి దూరమైందని.. అయినప్పటికీ శింబు కాంప్రమైజ్ కాలేదని.. తమ కోసం ప్రియురాలిని వదులుకున్నాడని రాజేందర్ చెప్పాడు. మరి హీరోయిన్ల విషయంలో సినిమా వాళ్లే ఇలా కండిషన్లు పెడితే.. సామాన్యులు వాళ్లను ఎలా ట్రీట్ చేస్తారో చెప్పేదముంది?