Begin typing your search above and press return to search.
కృష్ణమనోహర్ ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ అక్కడిదట!
By: Tupaki Desk | 16 July 2019 5:57 AM GMTహిట్టు.. సూపర్ హిట్టు సినిమాలు చాలానే ఉంటాయి కానీ బ్లాక్ బస్టర్ మూవీలు కొన్నే ఉంటాయి. ఆ కోవకే వస్తుంది మహేశ్ బాబు నటించిన పోకిరి మూవీ. ఈ సినిమాలో అప్పటివరకూ ఆకతాయిగా కనిపించే కుర్రాడు ఒక అండర్ కవర్ కాప్ అన్న విషయం బయటకు రావటమే కాదు.. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ తో సినిమాను మరింతగా కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి.
నిజానికి క్లైమాక్స్ ట్విస్ట్ కే మహేశ్ బాబు కనెక్ట్ కావటమే కాదు.. చాలా ఉత్సాహపడ్డారట. ఈ సినిమాలో మహేశ్ ఒకే ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తారని.. ఆ ట్విస్ట్ ను రివీల్ కావొద్దన్న ఉద్దేశంతో ఆ రోజు షూట్ కు తన స్టిల్ ఫోటోగ్రాఫర్ ను కూడా సెట్ కు రానివ్వలేదని చెప్పారు పూరీ.
తన కొడుకు గురించి గొప్పగా చెప్పే క్రమంలో.. కృష్ణ మనోహర్ ఐపీఎస్.. బ్యాచ్ నెంబర్ 32567 అంటూ నెంబరు చెప్పేస్తారు. భారీగా ఉంటుందన్న ఉద్దేశంతో బ్యాచ్ నెంబర్ చెప్పించా. ఇంతకీ ఆ నెంబరు ఎక్కడిదంటే.. పూరీ ఫోన్ లోని ఆఖరి ఐదు నెంబర్లే. బ్యాచ్ నెంబరుతో డైలాగ్ రాస్తే భారీగా ఉంటుందన్న పూరీ ఐడియా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మామూలుగా ఐపీఎస్ లకు బ్యాచ్ నెంబర్లు గట్రా ఏమీ ఉండదు. అదే సమయంలో ఆ విషయాన్ని తనకు పరిచయం ఉన్న ఏ ఐపీఎస్ కూడా అడగలేదన్నారు.
ఇదే మూవీని హిందీ సల్మాన్ తో చేసే సమయంలో ఒక రోజు షూటింగ్ సెట్ కు పోలీస్ యూనిఫామ్ తీసుకెళ్తే.. ఇదెందుకు? అని అడిగారని.. ఇందులో మీరు పోలీస్ కదా అని చెప్పే వరకూ సల్మాన్ కు ఆ విషయం తెలీదని చెప్పారు. మొత్తానికి కథ మొత్తం విని సినిమా ఒప్పుకునే అలవాటు సల్లూభాయ్ కి లేదన్న మాట.