Begin typing your search above and press return to search.

మహానాయకుడి అసలు రహస్యం ఇదా ?

By:  Tupaki Desk   |   13 Feb 2019 8:30 AM GMT
మహానాయకుడి అసలు రహస్యం ఇదా ?
X
ఒక కొత్త ట్రైలర్ లేదు. పబ్లిసిటీలో భాగంగా వదిలే పోస్టర్ల ఊసు లేదు. స్టార్ హీరో సినిమా సీక్వెల్ వస్తోందన్న సందడి లేదు. అసలు బాలయ్య అభిమానుల్లోనే మహానాయకుడు రిలీజ్ తాలుకు జోష్ కనిపించడం లేదు. అయినా వచ్చే శుక్రవారం వచ్చేందుకు ఎన్టీఆర్ బయోపిక్ సీక్వెల్ సిద్ధమవుతోంది. ముందు నుంచి ఒక ప్లాన్ ప్రకారం 22 విడుదల అని చెప్పినా ఏ సమస్యా ఉండేది కాదు. దానికి తగ్గట్టు ప్రచారం చేసుకునే వెసులుబాటు దక్కేది. ఇప్పుడా అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే ఇంత హడావిడిగా చెప్పాపెట్టకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ వెనుక బలమైన కారణం ఒకటి కనిపిస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్. ఈ నెల చివరి వారం లేదా మార్చ్ మొదటి వారం రావడం ఖాయం. ఒకవేళ ఆలోపు మహానాయకుడు విడుదల కాకపోతే పార్టీ పరంగా దాని వ్యవస్థాపకుడి మీద తీసిన సినిమా కాబట్టి విడుదల ఆగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే జరిగి ఎలక్షన్లు అయ్యాక రిలీజ్ చేస్తే ఇప్పుడున్న ఆ కాస్త ఆసక్తి కూడా చల్లరిపోవచ్చు. అందుకే తప్పని పరిస్థితిలో 22కే మొగ్గు చూపినట్టు వినికిడి

థియేటర్లలోకి వచ్చాక నోటిఫికేషన్ వస్తే ఏ చిక్కు ఉండదు. ఆడుతున్న దాన్ని తీసేయడం అంత సులువుగా ఉండదు. ఒకవేళ అక్కడి దాకా వస్తే మెజారిటీ ప్రేక్షకులు చూసేసి ఉంటారు కాబట్టి ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ద్వారా ఎలాగూ ఎక్కువ మందికి చేరుతుందన్న నమ్మకం కావొచ్చు మొత్తానికి గట్టి నిర్ణయమే తీసుకున్నారు. దీని వల్ల ప్లస్ కంటే మైనస్ లే ఎక్కువగా ఉన్నాయి. తక్కువ సమయం కాబట్టి బజ్ తెచ్చేందుకు సరిపడా టైం లేదు. పైగా కథానాయకుడి తాలుకు నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మహానాయకుడి మీద దృష్టి మరల్చాలి అంటే అదిరిపోయే ఓ ట్రైలర్ నో లేదా వరసబెట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తేనో తప్ప ఊపు రావడం కష్టం.