Begin typing your search above and press return to search.
ఎవరైనా బ్యాంక్ బ్యాలెన్స్ చూసే...
By: Tupaki Desk | 19 Aug 2015 7:58 AM GMTఅప్పటి రవితేజకి ఇప్పటి రవితేజకి పోలిక చూస్తే ఫిజికల్ గా మార్పొచ్చిందే కానీ, మిగతా విషయాల్లో ఏం పెద్దగా తేడా ఉండదు. అప్పుడు ఇప్పుడు అదే రవితేజ. ఏదో కొంత మార్పు సహజం. అయితే ఎదుటివాడు మాత్రం మన దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని బట్టి మాట్లాడుతాడని పంచ్ వేశాడు మాస్ రాజా రవితేజ. అంతేనా మరీ ఇంత సన్నగా అయిపోయారేంటి? అసలు ఎందుకిలా? అని ప్రశ్నిస్తే ఒకప్పుడు ఫిట్ నెస్ లో పక్కాగా ఉండేవాని. ఇప్పుడు మరింత పక్కా అయిపోయానని చెప్పారు.
82 కేజీల నుంచి 72 కేజీలకు తగ్గాక ఇంట్లో వాళ్లంతా బాగా చిక్కిపోయావ్ రా అంటున్నారు. నా పిల్లలు మాత్రం ఎంచక్కా ఉన్నావ్. మేం కూడా అలానే అవుతామని అంటున్నారని రవితేజ చెప్పాడు. రోజూ ఏడెనిమిది సార్లు స్వల్ప పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నా. ఓట్స్, స్వీట్స్, మిల్క్ షేక్స్ అన్నీ టైమ్ ప్రకారమే తీసుకుంటున్నా. అయితే ప్రతిదీ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే. టైమ్ ప్రకారం తినడం అనేది మొదటి నుంచీ ఉన్న అలవాటు. అదే ఇప్పుడూ కంటిన్యూ చేస్తున్నా. అంతేనా ప్రతి రోజూ వేకువఝామున 4.30కే నిద్ర లేస్తా. రెండుగంటల పాటు కార్డియో ఎక్సర్ సైజులు చేస్తానని రవితేజ చెప్పారు. అంత సన్నగా ఇలియానాలా మారిపోవడం వెనక అసలు నిజం ఇప్పుడు తెలిసింది కదూ?