Begin typing your search above and press return to search.
పెళ్లిలో సీక్రెట్ కోడ్.. ఇదేమైనా గూఢచారి సినిమానా?
By: Tupaki Desk | 2 Dec 2021 10:46 AM GMTపెళ్లిలో సీక్రెట్ కోడ్ ఏమిటో.. ఇదేమైనా స్పై ఆపరేషనా? అంటూ డౌట్లు పుట్టుకు రావొచ్చు. కానీ ఈ పెళ్లి వేడుకకు వెళ్లాలంటే ముందుగా సీక్రెట్ కోడ్ ని డీకోడ్ చేయాల్సి ఉంటుందట. విక్-కాట్ వివాహంలో అతిథులు కోడ్ పదాలను వెల్లడించిన తర్వాత లోనికి ఎంట్రీ పాజిబుల్ అట. అయితే ప్రత్యేక అతిథికి టైగర్ సఫారీ ఏర్పాటు ఉంటుందట.
బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ మరికొద్ది రోజుల్లో విక్కీ కౌశల్ కి సఖిగా మారనుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. పెళ్లి అప్ డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ పెళ్లికి భారీగానే ఖర్చు చేస్తున్నారని అంతా రాజరికం తరహాలో వేడుకగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్ కారణంగా వివాహంలో కొన్ని మార్పులు చేస్తున్నారట.
అతిథులు ప్రత్యేక పద్ధతిలో ప్రవేశిస్తారు
అతిథుల ఎంట్రీ కి కోడ్ తప్పనిసరి.. వీరి పెళ్లికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా ఎంట్రీ కోడ్ ఉంటుందట. దీని ద్వారా మాత్రమే అతను ఈ రాయల్ వెడ్డింగ్ లో భాగం కాగలడు. అంతే కాదు అతిథులు బస చేసే హోటల్ గదికి కూడా అదే కోడ్ సిస్టమ్ ఉంటుంది. అతిథులందరూ రహస్య కోడ్ తో ప్రవేశిస్తారు. ఆ కోడ్ లేకుండా ఎవరూ పెళ్లిలోకి ప్రవేశించలేరు. తమ వివాహాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఈ జంట ఇదంతా చేస్తోంది. ఎందుకంటే ఈ ప్రత్యేక క్షణాన్ని మీడియా వెలుగులోకి రాకుండా చేయాలని కూడా వారు కోరుకుంటున్నారు.
అతిథులకు టైగర్ సఫారీ..
విక్కీ-క్యాట్ ల వివాహానికి ఎంపికైన అతిథులు మాత్రమే హాజరవుతారని వార్తలు వచ్చినప్పటికీ ఈ వేడుక భారీగా జరగనుందని కథనాలు స్పష్టం చేస్తున్నాయి. పెళ్లికి వచ్చే అతిథుల కోసం టైగర్ సఫారీ కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి జోగి మహల్ నుంచి ప్రవేశం ఉంటుందని చెబుతున్నారు. టైగర్ సఫారీ కూడా కోడ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. అతిథి భద్రత కోసం ప్రైవేట్ లగ్జరీ కారును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అటవీ శాఖ నిబంధనల ప్రకారం జిప్సీలతో టైగర్ సఫారీని అతిథులు ఆస్వాధించవచ్చు.
వివాహాన్ని ప్రైవేట్ గా ఉంచాలనుకుంటున్నారా!
పెళ్లికి అతిథులు ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఫోటోలు బయటకు రాకూడదని ఈ జంట నిషేధించారని కూడా వినిపిస్తోంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటనేది డిసెంబర్ 9న మాత్రమే తెలిసిపోతుంది ఎందుకంటే ఇద్దరు స్టార్స్ నుండి పెళ్లి గురించి ఎటువంటి ప్రకటన రాలేదు.
విక్కీ క్యాట్ జోద్ పూర్ వెడ్డింగ్
విక్కీ కౌశల్ -కత్రినా కైఫ్ జంట పెళ్లి.. ఈ సీజన్ వివాహాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాటిలో ఒకటి. ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని ఒక విలాసవంతమైన రిసార్ట్ లో వివాహం చేసుకోనున్నారు. సవాయ్ మాధోపూర్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌత్ కా బర్వారాలోని హెరిటేజ్ ప్రాపర్టీలో మూడు రోజుల పాటు పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది. చౌత్ కా బర్వారా కొండపై ఉన్న శతాబ్దాల నాటి చౌత్ మాత ఆలయం ఎంతో పాపులర్ అన్న సంగతి విధితమే.